సీలేరు వైపు దృష్టిపెట్టిన నాగచైతన్య !

Seetha Sailaja

ప్రేక్షకుల ఆలోచనలు మారిపోవడంతో కొత్త కథలతో కూడిన సినిమాలను ఆదరిస్తున్నారు. దీనితో రొటీన్ సినిమాలకు రోజులు చెల్లినట్లే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో మీడియం హీరోల నుండి టాప్ హీరోల వరకు కొత్త కథల కోసం అన్వేషణ సాగిస్తూ అలాంటి కథలను తీయగల దర్శకులకే అవకాశాలు ఇస్తున్నారు.

ఇప్పుడు ఈ లిస్టులోకి నాగచైతన్య కూడ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు పరుశు రామ్ ‘సర్కారు వారి పాట’ ఊహించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో మరో సినిమా వైపు అడుగులు వేయలేకపోతున్నాడు. అయితే ఈమధ్య పరుశు రామ్ నాగచైతన్యను కలిసి చెప్పిన కథకు అతడు ఓకె చెప్పడంతో ఇప్పుడు ఆమూవీ ప్రాజెక్ట్ ముందడుగు వేయబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారంమేరకు పరుశు రామ్ ఉత్తరాంద్ర ప్రాంతంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీలేరు ప్రాజెక్ట్ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని పరుశు రామ్ ఈ కథ వ్రాసినట్లు తెలుస్తోంది. ఈ స్టోరీ లైన్ చైతన్య కు కూడ బాగా నచ్చడంతో ఆ స్టోరీకి అతడు ఓకె చెప్పడంతో ఇప్పుడు ఆసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు వేగంగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి అటు చైతన్య ఇటు పరుశు రామ్ ల పరిస్థితి ఒకేలా ఉంది. వీరిద్దరికీ ఇప్పుడు ఒక సూపర్ హిట్ కావాలి. దీనితో వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయింది అంటున్నారు. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కూడ చాల కీలకం కాబట్టి ఆపాత్ర కోసం సాయి పల్లవితో సంప్రదింపులు జరుగుతున్నట్లు టాక్. మహేష్ తో తీసిన మూవీతో పరుశు రామ్ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోతానని భావించాడు. అయితే ఆకలలు నెరవేరలేదు. దీనితో ఇప్పుడు ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసి ఆతరువాత మళ్ళీ టాప్ హీరోలకు సినిమాలు చేయగల దర్శకుడుగా మారాలని పరుశు రామ్ ఒక వాస్తవ కథను పెట్టుకుని చేస్తున్న ప్రయోగాలు ఎంతవరకు విజయవంతం అవుతాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: