ఆ ప్రాంతం నేపథ్యంలో సాగనున్న రామ్ చరణ్... బుచ్చిబాబు మూవీ..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ లో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. అంజలి , సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ,  ఎస్ జే విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు శంకర్ ఈ మూవీ ని తన పూర్వపు మూవీ ల  మాదిరిగానే అత్యంత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం శంకర్ , రామ్ చరణ్ మరియు కియరా అద్వానీ లపై న్యూజిలాండ్ లోని అందమైన లోకేషన్ లలో ఒక సాంగ్ చిత్రీకరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సాంగ్ చిత్రీకరణ న్యూజిలాండ్ లో జరుగుతుంది.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి మూవీ ని బుచ్చిబాబు సన తో చేయనున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు సన కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్నట్లు , అది కూడా శ్రీకాకుళం రూరల్ ఏరియా బేస్డ్ కథతో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ లో హీరో గా నటించనుండడం ఉప్పెన మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న బుచ్చిబాబు ఈ మూవీ కి దర్శకత్వం వహించ నుండడంతో ఈ మూవీ మొదలు కాకముందే మెగా అభిమానులు ఈ మూవీపై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: