సూపర్ స్టార్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నా ఫ్యాన్స్..!!

murali krishna
పగవారికి కూడా మహేష్ బాధ రాకూడదు. నెలలు, రోజుల వ్యవధిలో ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయారు అని మనం చెప్పవచ్చు. అన్నయ్య రమేష్ బాబు తక్కువ వయసులో అకాల మరణం పొందారు.
ఆ వేదన నుండి బయటపడే లోపు అమ్మ, నాన్నలు మహేష్ ని వదిలిపోయారు. 2022 మహేష్ కి తీరని వేదన మిగిల్చిన ఏడాదిగా మిలిగిపోయింది. అన్నయ్య రమేష్ అంటే మహేష్ కి వల్లమాలిన ప్రేమ. ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేశారు. రమేష్ హీరోగా సక్సెస్ కాకున్నా… మహేష్ ఆయన వెంట ఉన్నారు. నిర్మాతగా ప్రోత్సహించారు. అనారోగ్యం రమేష్ బాబుని మహేష్ కు దూరం చేసింది. జనవరిలో రమేష్ బాబు మృతి చెందారు.
మరో తొమ్మిది నెలల్లో మహేష్ మరో మరణ వార్త వినాల్సి వచ్చింది మరీ, అమ్మ ఇందిరా దేవి సెప్టెంబర్ 28న కన్నుమూశారు. అమ్మతో మహేష్ కి మంచి అనుబంధం ఉంది. తన ప్రతి కొత్త సినిమా విడుదలకు ముందు ఆమె వద్దకు వెళ్లి కాఫీ చేయించుకొని తాగుతారు అంటా మహేష్. అమ్మ చేతి కాఫీ నాకు ప్రసాదంతో సమానం. దాన్ని ఆశీర్వాదంలా ఫీల్ అవుతానని మహేష్ ఒక సందర్భంలో చెప్పారు.
ఇందిరా దేవి మరణించిన కొద్దిరోజులకు తండ్రి కృష్ణ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో చేరిన కృష్ణ నవంబర్ 15న మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మహేష్ కి దెబ్బ మీద దెబ్బ పడ్డాయి. కృష్ణ మరణాంతర కార్యక్రమాలు మహేష్ పూర్తి చేస్తున్నారు. కృష్ణ అస్థికలు విజయవాడ కృష్ణానదిలో కూడా కలిపారు. అయితే పైకి గంభీరంగా కనిపిస్తున్న మహేష్ లోలోపల వేదన అనుభవిస్తున్నారట. మహేష్ ఎవరితో మాట్లాడటం లేదట. ఎప్పుడూ ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారట.
అతి ముఖ్యమైన విషయాలు మినహాయించి ఎవరినీ కలవడం  కూడా లేదట. ఫోన్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదని  మనకు సమాచారం. మహేష్ పరిస్థితి అర్థం చేసుకుని ఆయన్ని డిస్టర్బ్ చేయడం లేదట. ఈ న్యూస్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న SSMB 28 షూట్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం అవుతుంది అంటున్నారు. 2023 సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా ఎంపికయ్యారనే వార్తలు  బాగానే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: