నరేష్‌ని దూరం పెట్టిన మహేష్ బాబు.. నమ్రతనే డామినేట్ చేయాలనుకుంటున్న పవిత్ర..!?

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న అనారోగ్యంతో కన్నుమూయడం అందరిని బాధించింది.అయితే  ముఖ్యంగా మహేష్ బాబు కృష్ణ మృతిని అస్సలు జీర్ణించుకోలేకపోయారు.ఇదిలావుంటే మహేష్ బాబు .. కృష్ణ మృతి తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నాడట.ఇక  సీనియర్ నటుడు నరేష్ ని దూరం పెట్టాలని డిసైడ్ అయ్యాడట.అయితే  ఇన్నాళ్లలు కృష్ణ ముఖం చూసి ఆయనతో కొంత సన్నిహితంగా ఉండేవారు. కానిన ఇప్పుడు ఆయనను పూర్తిగా దూరం పెట్టినట్టు తెలుస్తుంది. కాగా సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని నరేశ్ ఇంటికే తరలించారు.

అయితే ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు, సెలబ్రెటీలు, రాజకీయ వేత్తలు ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించేందుకు అక్కడికి రాగా, ఆ సమయంలో నరేష్ ప్రవర్తన చాలా మందికి చిరాకు తెప్పించింది. ఇక నరేశ్ అక్కడికి వచ్చిన వచ్చిన సెలబ్రెటీలతో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వచ్చాయి.. అదేదో ఫంక్షన్ లాగా వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎదురెళ్లి స్వాగతించడం, హుందాగా వ్యవహరించకపోవడంతో పాటు విషాద సమయంలో హడావుడిగా నడుచుకోవడం పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే ఆయన ప్రవర్తనపై కుటుంబీకులకూ కూడా నచ్చలేదని తెలుస్తోంది.

ఇక నటి పవిత్రని కూడా అక్కడే కుటుంబ సభ్యులతో కలిపి కూర్చోబెట్టి వచ్చిన వారందరికి పరిచయం చేయడం వంటివి చేశాడట.అయితే  సీఎం కేసీఆర్ వచ్చిన సమయంలో కూడా ఆయన ప్రవర్తన ఎవరికి నచ్చలేదు.ఇక దివంగత నటి విజయ నిర్మల చనిపోయినప్పుడు కూడా నరేశ్ చేష్ఠలు సినీ పెద్దలకు కోపం తెప్పించగా, ఇప్పుడూ మళ్లీ అదే ప్రవర్తన కలిగి ఉండటం పట్ల ఇండస్ట్రీలోని ప్రముఖులుతో పాటు మహేష్ కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.అయితే పవిత్ర లోకేష్ కృష్ణ మరణాన్ని క్యాష్ చేసుకొని కొత్త డిమాండ్స్ తో ఘట్టమనేని ఫ్యామిలీను అల్లాడించాలని చూస్తుందట. ఇక భర్త కోసం కుటుంబం పరువు కోసం తను ఎంతో ఇష్టపడే నటనను వదులుకొని ఉత్తమ ఇల్లాలుగా మంచి పేరు సంపాదించుకున్న నమ్రత లాగా ఘట్టమనేని కోడలు కావాలని పవిత్ర అనుకుంటుందట.ఇకపోతే  ఇవన్నీ తెలిసి మహేష్ వారిని దూరం పెట్టాడని టాక్ వినిపిస్తుంది. ఇక కృష్ణ అస్థికల నిమజ్జనం సమయంలో నరేష్ కనిపించకపోవడానికి కారణం ఇదే అని కొందరు అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: