"వీర సింహారెడ్డి" మూవీలో ఆ రెండు పాత్రలలో కనిపించనున్న బాలకృష్ణ..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. క్రాక్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వీర సింహా రెడ్డి మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తూ ఉండడం తో ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వీర సింహా రెడ్డి మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా , ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక పాటను విడుదల చేసింది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది  వీర సింహా రెడ్డి మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు అందులో బాలకృష్ణ ఒక పాత్రలో వీర సింహా రెడ్డి గా కనిపించ నుండగా , మరో పాత్రలో బాల నరసింహ రెడ్డి గా కనిపించ బోతున్నట్లు ఈ రెండు పాత్రలు కూడా అద్భుతంగా ఉండబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: