నాకు ఆ టెన్నిస్ స్టార్ పై క్రష్ ఉండేది... వరుణ్ ధావన్..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీ లలో నటించి అద్భుతమైన క్రేజ్ ను దేశ వ్యాప్తంగా సంపాదించు కున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా వరుణ్ ధావన్ "బేడియా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా నవంబర్ 25 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ ని హిందీ తో పాటు తెలుగు మరియు తమిళ భాషలలో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. తెలుగు లో ఈ మూవీ ని తోడేలు అనే పేరుతో చిత్ర బృందం భారీ ఎత్తున విడుదల చేసింది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా వరుణ్ ధావన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ మాట్లాడుతూ ... నాకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పై బాగా క్రష్ ఉండేది అని వరుణ్ ధావన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.

అప్పట్లో నేను ప్రొడక్షన్ కంపెనీ లో వర్క్ చేస్తున్నప్పుడు సానియా మీర్జా యాడ్ చేసేందుకు అక్కడికి వచ్చింది. సానియా మీర్జా తనకు ఆపిల్ కావాలని అడిగితే వెళ్లి తనకు తెచ్చి ఇచ్చా. అది చూసిన సానియా మీర్జా తల్లి నన్ను ఎందుకు తెచ్చావు అని అడిగారు. దానితో సానియా మీర్జా నేనే తెమ్మన్నాని చెప్పడంతో ఆ రోజు బతికిపోయా అని తాజాగా వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: