భవదీయుడు భగత్ సింగ్ మూవీ పనులను ప్రారంభించిన హరీష్ శంకర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హరీష్ శంకర్ , రవితేజ హీరో గా తెరకెక్కిన షాక్ మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో జ్యోతిక , రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈ దర్శకుడు మిరపకాయ్ మూవీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం హరీష్ శంకర్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా భవదీయుడు భగత్ సింగ్ మూవీ ని  చిత్రీకరించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

అలాగే ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ కు సంబంధించిన  అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటి వరకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హరీష్ శంకర్ "భవదీయుడు భగత్ సింగ్" మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. దానితో ప్రస్తుతం హరీష్ శంకర్  దేవి శ్రీ ప్రసాద్ తో ఈ సినిమా ఆల్బమ్ పై చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: