నెట్టింట హైలెట్ గా మారిన హన్సిక, ఆమె భర్త?

Purushottham Vinay
బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సిక మొత్వానీ గుర్తింపు తెచ్చుకుంది. పేరుకే నార్త్ ఇండియా అమ్మాయి అయినప్పటికీ సౌత్ లోనే ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 'దేశముదురు' సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఈ సినిమా ఇచ్చిన హిట్ వల్ల పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది హన్సిక.'మస్కా' 'బిల్లా' వంటి పెద్ద పెద్ద సినిమాల్లో ఈ వైట్ బ్యూటీ నటించింది. 2011 వ సంవత్సరంలో 'మాప్పిళ్త్లె' అనే సినిమాతో ఈమె కోలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించడమే కాకుండా హన్సికని అక్కడ స్టార్ హీరోయిన్ గా నిలబెట్టేసింది.ఈ బ్యూటీ లవ్ ఎఫైర్లు కూడా అందరికీ తెలిసినవే..సిద్ధార్థ్ తో లవ్ ట్రాక్ నడిపింది. ఇంకా అలాగే శింబుతో కూడా కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపింది ఈ బ్యూటీ. కానీ కొన్ని కారణాల వల్ల అతనికి బ్రేకప్ చెప్పేసింది.


కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్ళికి రెడీ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. తన చిన్నప్పటి మిత్రుడు, ఇంకా అలాగే బిజినెస్ పార్ట్నర్ అయిన సోహైల్ తో పెళ్లికి రెడీ అయ్యింది హన్సిక మొత్వానీ. అయితే ఇదివరకే అతనికి పెళ్ళైనప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అతను మొదటి భార్యతో అతను విడాకులు తీసుకోవడం జరిగింది.ఇక హన్సిక - సోహైల్ ల పెళ్లి డిసెంబర్ 4 వ తేదీన రాజస్థాన్ లోని రాజకోటలో చాలా ఘనంగా జరగబోతుంది. ఆల్రెడీ పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. ముంబైలో మంగళవారం నాడు హన్సిక నివాసంలో 'మాతా కీ చౌకి' పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో కాబోయే ఈ వధూవరులు ఇద్దరూ పాల్గొన్నారు.వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఈ పూజ కోసం రెడ్ డ్రెస్ లో కనిపించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి హైలెట్ గా నిలిచారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: