ఎట్టకేలకు రష్మికకు క్షమాపణలు చెప్పిన ప్రముఖ టీవీ ఛానల్.. కానీ,,!

Divya
కాంతారా సినిమా ఎఫెక్ట్ నేషనల్ క్రష్ రష్మికపై పడిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకెళితే.. వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న రష్మిక.. బాలీవుడ్ లో కూడా మూడు సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ముంబై ఎయిర్పోర్ట్ లో విలేకరుల కంట పడింది. ఈ సందర్భంగా కాంతారా సినిమా చూశారా? అని రిపోర్టర్లు ఆమెను ప్రశ్నించినప్పుడు.. ఇంకా చూడలేదని .. త్వరలోనే చూస్తానని సమాధానం చెప్పింది. దీనితో ఈ వీడియో కాస్త వైరల్ గా మారడమే కాకుండా ఇది చూసిన కన్నడ ప్రేక్షకులు ఆమెపై విమర్శలు దాడికి దిగారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన దానివి అయి ఉండి.. కన్నడ ఇండస్ట్రీ తోనే కెరియర్ మొదలుపెట్టి .. ఇప్పుడు మూలాలను మరిచిపోయి.. ప్రపంచమే మెచ్చిన కాంతారా సినిమాను ఇంకా చూడకపోవడం ఏంటి? అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా రకరకాల కామెంట్లు తో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోని ఒక ప్రముఖ టీవీ ఛానల్ కూడా రష్మిక ప్రవర్తనపై మండిపడుతూ.. ఆమె కావాలని సినిమా చూడలేదు అన్నట్టుగా ప్రచారం చేసింది.  అంతే కాదు రష్మిక నిశ్చితార్థం చేసుకోని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న రక్షిత్ శెట్టి తమ్ముడే ఈ రిషబ్ శెట్టి.. రిషబ్ శెట్టి నుంచి సినిమా రావడం కారణంగానే ఆమె ఈ సినిమా చూడలేదు అంటూ కూడా వార్తలను చిత్రీకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రష్మిక మొదటిసారి ఒక లాంగ్ నోటు విడుదల చేసి తనపై ఎందుకు ఇంత కుట్ర పన్నుతున్నారు .. అనే విషయం వెల్లడిస్తూ మరింత ఎమోషనల్ అయింది . కానీ ఎట్టకేలకు అసలు విషయం తెలుసుకున్న ఆ ప్రముఖ టీవీ ఛానల్ రష్మికకు ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పింది.

టీవీ ఛానల్ అయితే రష్మికకు క్షమాపణలు చెప్పింది కానీ కన్నడ ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ ఆమెపై పగతో ఉన్నారని స్పష్టం అవుతోంది. మరొకవైపు విజయ్ దేవరకొండకు ఈమె డేటింగ్ చేస్తోందనే వార్తలపై  కూడా ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: