తమిళ్ లో హిట్-2 విడుదలపై సంచలన కామెంట్స్ చేసిన అడవి శేష్..!

Divya
ప్రముఖ యంగ్ హీరో అడవి శేష్ గురించి.. ఆయన టాలెంట్ గురించి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే గూఢచారి, మేజర్, అవును, క్షణం, ఎవరు, దొంగాట వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. వాస్తవానికి అడవి శేష్ ఎంచుకునే కథల ఎంపిక చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పడానికి ఆయన సినిమాల ఫలితాలే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న హిట్ 2 సినిమాలో కూడా అడవి శేష్ నటిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను కూడా మేజర్ సినిమా రేంజ్ లో మలయాళం, హిందీ , తమిళ్ లో కూడా విడుదల చేయాలని నిర్వాహకులు భావించారు. అయితే ఇదే విషయంపై అడవి శేష్ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలవగా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది . త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన అడవి శేష్ సినిమా విడుదలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అడవి శేషు మాట్లాడుతూ..  మేజర్ సినిమాలాగే హిట్ 2 సినిమాని కూడా తమిళ్ , మలయాళం , హిందీ భాషల్లో విడుదల చేయాలని అనుకున్నాము.  అయితే ఎప్పటిలాగే మలయాళం ,హిందీ భాషల్లో హిట్ 2 సినిమా విడుదలవుతుంది. కానీ తమిళ్ భాషలో ఈ సినిమాను విడుదల చేయడం సాధ్యపడదు అంటూ తెలిపాడు.

అసలు విషయంలోకెళితే తమిళనాడు లో సినిమా విడుదల చేస్తే అధిక పన్ను రేట్ల కారణంగా సినిమా విడుదల చేయడం సాధ్యపడదు అని , కేవలం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో మాత్రమే హిట్ 2  సినిమా రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు అడవి శేష్. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: