కంపోజ్ చేసినా యశోదలో ఆ సాంగ్ ఎందుకు తీసేశారు..!

shami
సమంత లీడ్ రోల్ లో తమిళ దర్శక ద్వయం హరి హరీష్ డైరక్షన్ లో వచ్చిన సినిమా యశోద. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీ నిర్మించారు. సినిమా బడ్జెట్ 40 కోట్ల పైన కాగా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. నవంబర్ 11న రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్ తో కూడా మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్. డిసెంబర్ 9న అమేజాన్ ప్రైం లో యశోద రాబోతుందట. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు.
సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కంపోజ్ చేశారట. స్టార్ హీరోల తరహాలో సమంత ఎంట్రీ సాంగ్ ఒకటి అదిరిపోయేలా చేశారట. అయితే అది మాత్రం సినిమాలో మిస్ అయ్యింది. ఆ సాంగ్ షూట్ చేయడానికి సమంత ఆరోగ్యం బాగాలేదని అందుకే ఆ సాంగ్ వదిలేశారని చెప్పారు మణిశర్మ. ఒకవేళ ఆ సాంగ్ పడి ఉంటే రచ్చ రచ్చ చేసేదని అంటున్నారు. ఇప్పటికే సమంత పుష్ప సినిమాలో చేసిన ఉ అంటావా మావ సాంగ్ రికార్డులు సృష్టించింది. యశోద లో ఆ సాంగ్ వస్తే దాన్ని బీట్ చేసేదని అంటున్నారు. కేవలం ఆడియో మాత్రమే ఉండగా ఆ సాంగ్ ఇక ప్రేక్షకులు వినే ఛాన్స్ లేదని చెప్పొచ్చు.
యశోద సినిమా కోసం సమంత చాలా రిస్క్ తీసుకుంది. మయోసైటిస్ తో బాధపడుతూనే సమంత యశోద ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అంతగా కష్టపడ్డది కాబట్టే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. సమంత నెక్స్ట్ సినిమా శాకుంతలంతో రాబోతుంది. ఆ మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లో భారీ రేంజ్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో నార్త్ ఆడియన్స్ కు పరిచయమైన సమంత వరుస క్రేజీ సినిమాలతో అక్కడ ఆడియన్స్ ని అలరిస్తుంది. డైరెక్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ లు కూడా రెండు మూడు లైన్ లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: