యశోద మూవీ 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ నటి మానులలో ఒకరు అయినటు వంటి సమంత తాజాగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో ప్రధానపాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా , మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఉన్ని ముకుందన్ ,  వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేష్ , మురళీ శర్మ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

ఈ మూవీ నవంబర్ 11 వ తేదీన తెలుగు , తమిళ  , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ లభించడం తో ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. దానితో ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని సక్సెస్ ను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇప్పటివరకు యశోద మూవీ 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.

ఈ 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 4.04 కోట్లు .
సీడెడ్ : 80 లక్షలు .
యు ఏ : 1.12 కోట్లు .
ఈస్ట్ : 49 లక్షలు .
వెస్ట్ : 30 లక్షలు .
గుంటూర్ : 51 లక్షలు .
కృష్ణ : 56 లక్షలు .
నెల్లూర్ : 25 లక్షలు .
10 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో యశోద మూవీ 8.07 కోట్ల షేర్ , 14.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
తమిళ్ :  1.15 కోట్లు .
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో :  1.20 కోట్లు .
ఓవర్ సీస్ లో :  2.65 కోట్లు .
10 రోజుల్లో యశోద మూవీ ప్రపంచ వ్యాప్తంగా 13.07 కోట్ల షేర్ ,  27.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: