విజయ్ దేవరకొండ మూవీలో మాధవన్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు మూవీ తో హీరోగా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత అనేక విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ "ఖుషి" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. శివ నిర్మాణ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంత ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ ప్రారంభం ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇప్పటికే ఖుషి మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఖుషి మూవీ లో సెకండ్ హాఫ్ లో ఒక కీలకమైన పాత్ర ఉండబోతున్నట్లు , ఆ పాత్రలో మంచి టాలెంట్ ఉన్న నటలలో ఒకరు అయినటు వంటి మాధవన్ నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: