మహేష్ వారసుడు పై ఆశక్తికర చర్చలు !

Seetha Sailaja
మహేష్ వయసు ఇంకా 50 సంవత్సరాలు కూడ పూర్తి కాలేదు. కనీసం మరో 10 సంవత్సరాలు మహేష్ హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణ తన తండ్రితో కలిసి ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో నటించినప్పటికీ అతడు యంగ్ హీరోగా ఎప్పుడు మారతాడు అన్న ఆశక్తి మహేష్ అభిమానులలో ఉంది.

అయితే గౌతమ్ కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేలోపే మహేష్ వారసుడుగా జయకృష్ణ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అన్నసందేహాలు ఇప్పుడు చాలమందికి వస్తున్నాయి. మహేష్ అన్న రమేష్ కొడుకు ఈ జయకృష్ణ. ప్రస్తుతం అమెరికాలో డిగ్రీ చదువుతున్న జయకృష్ణ తన తాత కృష్ణ మరణ వార్త తెలుసుకుని హైదరాబాద్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

హీరో కృష్ణ చిన్నకర్మ కార్యక్రమం ఈమధ్యనే జరిగింది. ఆ కార్యక్రమానికి మహేష్ కు సన్నిహితులైన చాలామంది నిర్మాతలు దర్శకులు రావడం జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి వచ్చిన వారంతా మహేష్ ను పలకరించి అతడి పక్కనే ఉన్న జయకృష్ణ వైపు చాల ఆశక్తిగా చూసారట. మహేష్ కూడ తన అన్న కొడుకుని ఆ కార్యక్రమానికి వచ్చిన నిర్మాతలకు దర్శకులకు పరిచయం చేసినట్లు తెలుస్తోంది.

వారంతా జయకృష్ణ తో మాట్లాడటమే కాకుండా సినిమాలలో నటించే ఉద్దేశ్యం ఉందా అని అడిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రశ్నలకు మహేష్ కల్పించుకుంటూ జయకృష్ణ ను ఇండస్ట్రీలో పరిచయం చేసే ఉద్దేశ్యం ఉన్నప్పటికీ అతడి చదువు పూర్తి అయిన తరువాత మాత్రమే అతడి ఎంట్రీ ఉంటుంది అన్న సంకేతాలు ఇచ్చాడట. దీనితో మహేష్ బాబుకు వారుసుడు రెడీ అవుతున్నాడు అంటూ అప్పుడే ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో మొదలైపోయాయి. ఇండస్ట్రీలో హీరోల కుటుంబం నుండి వారసులు రావడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఇప్పటికే మహేష్ మేనల్లుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మహేష్ తన బావ సుధీర్ బాబు ను హీరోగా నిలబెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా సుధీర్ బాబు కెరియర్ ఇంకా పూర్తిగా సెటిల్ కాని విషయం తెలిసిందే..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: