టాలీవుడ్ లో నంబర్ వన్ గా నిలిచిన ప్రభాస్, సమంత..?

Anilkumar
సినిమా ఇండస్ట్రీలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన హీరో, హీరోయిన్లు ఎవరు? తాజాగా ఆర్మాక్స్‌ మీడియా ప్రకారం మాత్రం వీళ్లలో ప్రభాస్‌, సమంత టాప్‌లో ఉన్నట్లు తేలింది.ఇకపోతే ఆర్మాక్స్‌ స్టార్స్‌ ఇండియా లవ్స్‌: మోస్ట్‌ పాపులర్‌ మేల్‌, ఫిమేల్‌ తెలుగు స్టార్స్‌ పేరుతో ఆ సంస్థ ఓ సర్వే నిర్వహించింది.ఇక ఇందులో మేల్‌ కేటగిరీలో ప్రభాస్‌, ఫిమేల్‌ కేటగిరీలో సమంత ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండటం విశేషం. అయితే అక్టోబర్‌ నెలకుగాను ఈ ఫలితాలు వెలువడ్డాయి.కాగా  మేల్‌ స్టార్స్‌లో ప్రభాస్‌ టాప్‌లో ఉండగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మహేష్‌ బాబు, రామ్‌చరణ్‌ టాప్‌ 5లో చోటు దక్కించుకున్నారు. వీళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌, నాని, విజయ్‌ దేవరకొండ,

 చిరంజీవి, వెంకటేశ్‌ ఉండటం విశేషం.ఇకపోతే బాహుబలి మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌కు ఇంకా ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదని ఈ సర్వే తేల్చింది. కాగా సాహో, రాధేశ్యామ్‌లతో మరో రెండు పాన్‌ ఇండియా మూవీస్‌ చేసిన అతడు.. రానున్న రోజుల్లో ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ కేలాంటి ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్ఆర్‌ఆర్‌, పుష్ప మూవీలతో పాన్‌ ఇండియా స్టార్లుగా ఎదిగిన జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లు కూడా టాప్‌ 5లో చోటు దక్కించుకున్నారు. ఇక పాన్‌ ఇండియా వదిలేసి టాలీవుడ్‌కే పరిమితమైనా కూడా మహేష్ బాబు క్రేజ్‌ మాత్రం అలాగే ఉంది.

అయితే అతడు ఈ లిస్ట్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.ఇకపోతే ఫిమేల్‌ లీడ్‌ విషయానికి వస్తే ఈ మధ్యే యశోద చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత టాప్‌లో ఉంది. ఇక ఆమె తర్వాతి స్థానాల్లో కాజల్‌ అగర్వాల్‌, అనుష్క శెట్టి, సాయి పల్లవి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, కీర్తి సురేశ్‌, తమన్నా భాటియా, కృతి శెట్టి, అనుపమ పరమేశ్వరన్‌ ఉన్నారు.అయితే యశోదతో సమంత కూడా పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిపోయింది.  ఇక త్వరలోనే శాకుంతలంతో మరోసారి పాన్‌ ఇండియా స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.కాగా  యశోద ఇప్పటికే బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అయితే అటు పెళ్లి, ఆ తర్వాత బాబుకు జన్మనిచ్చిన తర్వాత చాలా రోజులుగా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా కాజల్‌ అగర్వాల్‌ ఈ లిస్ట్‌లో రెండోస్థానంలో ఉండటం విశేషం.ఇక  ఆమె ఇండియన్‌ 2 మూవీలో నటించే ఛాన్స్‌ కొట్టేసిన విషయం తెలిసిందే..!!`

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: