కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారనే విషయం తెల్సి మహేష్ బాబు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..?

Anilkumar
కృష్ణ మరణించిన సంగతి వినగానే దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కుటుంబ సభ్యుల దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ ఈయనకు ఘన నివాళి అర్పించింది. ఇక ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన విజయాలను తెచ్చి పెట్టడమే కాకుండా సరికొత్త టెక్నాలజీని కూడా తెలుగు జనాలకు పరిచయం చేశాడు. అలాంటి గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఈయన ఎలాంటి వివాదాల్లోకి పోడు కానీ కేవలం వ్యక్తిగత జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకొని వివాదాస్పదమయ్యారు.ఇక మొదట తన మేన మరదలు అయిన ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాడు.  

ఆమె బతుకుండగానే హీరోయిన్ విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నాడు కృష్ణ.  ఈ విషయంలో చాలామంది ఆయనను తప్పు పట్టారు. రెండో పెళ్లి విషయంలో మహేష్ బాబు ఎలా స్పందించాడు?అనే విషయం ఎవరికీ తెలియదు. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక విజయనిర్మల ను పెళ్లి చేసుకునే టైం కి మహేష్ బాబు వయసు చాలా చిన్నది. ఆ టైంలో కృష్ణని మహేష్ బాబు ఏమీ అనలేని పరిస్థితి.అయితే మహేష్ బాబు పెద్దయ్యాక కూడా తండ్రి రెండో పెళ్లి గురించి ఒక్క మాట కూడా అనలేద. ప్రతి సందర్భంలో తన తండ్రి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఒక ఆదర్శవంతమైన కొడుకుగా మహేష్ బాబు నిలిచారు.

మహేష్ బాబు కి తండ్రి కన్నా ఎక్కువ తల్లితో సాన్నిహిత్యం ఉండేది.  అదే అనుబంధాన్ని మహేష్ బాబు కృష్ణ తో కూడా పెట్టుకున్నారు అంటారు ఇండస్ట్రీ జనాలు. మహేష్ బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరో అవ్వడానికే కారణం సూపర్ స్టార్ కృష్ణ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.కృష్ణ విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నా కూడా తన మొదటి భార్యకు అన్యాయం చేయకుండా మొదటి భార్యను, పిల్లలను వదిలి వేయలేదు. ఇక ఇద్దరు భార్యలకు ఎప్పుడు కూడా సమన్యాయం చేశారు.అయితే  అందుకే రెండు పెళ్లిళ్లు చేసుకున్నా కూడా కృష్ణ వ్యక్తిగత విషయంలో ఎప్పుడూ గొడవలు,విభేదాలు రాలేవు.ఇకపోతే  కృష్ణ విజయనిర్మలతో ఎలా ఉంటారో ఇందిరా దేవి మహేష్ బాబు తో కూడా అలాగే మెదిలేవారట. అయితే అందుకే ఏ రోజు కూడా కృష్ణను మహేష్ బాబు వేలెత్తి చూపలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: