ఆదిపురుష్: హిందీ హీరోలకు వణుకు పుట్టించిందిగా?

Purushottham Vinay
ఆది పురుష్: యంగ్  రెబల్  స్టార్  ప్రభాస్  ఆదిపురుష్‌  సినిమా మీద ప్రస్తుతం ఉన్న నెగెటివిటీ గురించి అందరికీ కూడా తెలిసిందే. ఆదిపురుష్  టీజర్  రానంత వరకు కూడా ఒక రేంజ్ లో ఇమేజ్  ఉంది.ఇక టీజర్ వచ్చాక సినిమా మీద చాలా ఎక్కువగా నెగెటివ్ ఇమేజ్ వచ్చింది.ఈ సినిమా కోసం వాడిన గెటప్స్, లుక్స్ ఇంకా వీఎఫ్‌ఎక్స్‌లు దారుణంగా ఉన్నాయని అందరూ ఏకిపారేశారు. ఇది మొబైల్ ఆడియెన్స్ కోసం తీసిన సినిమా కాదని, థియేటర్లో త్రీడీలో ఎక్స్ పీరియెన్స్ చేసేందుకు తీశామని దర్శకుడు ఓం రౌత్ చెప్పుకొచ్చాడు.అయితే ఇప్పుడు ఆదిపురుష్‌ సినిమా విడుదలను వాయిదా వేశారు. రిపేర్లు చేసేందుకు అదనంగా వంద కోట్లు ఖర్చు పెట్టబోతోన్నారు. వీఎఫ్‌ఎక్స్ మార్చబోతోన్నారని ఇంకా సైఫ్ అలీ ఖాన్ గడ్డం కూడా తీయబోతోన్నారట. 


ఇలా చాలా మార్పులే అందులో జరగబోతోన్నాయని సమాచారం తెలుస్తుంది .అయితే ఇంత నెగెటివిటీ ఉన్నా కూడా ఆదిపురుష్‌ టీజర్ ఇప్పుడు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.హిందీ భాషలో వంద మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన టీజర్‌గా ఆదిపురుష్‌ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్ మాత్రమే ఇంత వరకు ఆ ఫీట్‌ను సాధించింది. ఇప్పటి వరకు ఏకంగా ఈ టీజర్ పదకొండు కోట్ల వ్యూస్‌ను కొల్లగొట్టేసింది. ఆదిపురుష్ మాత్రం అతి తక్కువ సమయంలోనే ఏకంగా పది కోట్ల వ్యూస్‌ను కొల్లగొట్టేసింది.ఇలా సౌత్ సినిమాలే యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టేస్తున్నాయి. ఇక ప్రభాస్ స్టామినా, ఆదిపురుష్‌ క్రేజ్ చూసి బాలీవుడ్ జనాలు కూడా ఆశ్చర్యపోతోన్నట్టుగా ఉంది. యూట్యూబ్‌లో ఇలాంటి రికార్డులు చూసి బాలీవుడ్ హీరోల వెన్నులో వణుకు పుట్టినట్టు కనిపిస్తోంది. సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకున్న ఆదిపురుష్‌ సినిమా మొత్తానికి జూన్‌కు వెళ్లింది. మరి ఇది ఆ సమయానికి అయినా ఈ సినిమా వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: