టాలీవుడ్ లో సత్తా చాటుతున్న కన్నడ ముద్దుగుమ్మలు వీరే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోయిన్ లు ప్రస్తుతం వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో తమ కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు. అందులో ప్రస్తుతం కన్నడ ముద్దు గుమ్మలు కూడా ఉన్నారు. అలా కన్నడ నుండి వచ్చి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు ఎవరో తెలుసుకుందాం.

ఒక లైలా కోసం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను టాలీవుడ్ ఇండస్ట్రీ లో అందుకుంటూ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న పూజ హెగ్డే కన్నడ నుండి వచ్చింది. నాని హీరోగా  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కిన జెర్సీ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న శ్రద్ధ శ్రీనాథ్ కన్నడ ముద్దుగుమ్మే. ఛలో మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న రష్మిక మందన కూడా కన్నడ ముద్దు గుమ్మే. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందD మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా కన్నడ కు చెందిన ముద్దుగుమ్మే.  

నన్ను దోచుకుందువటే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి అనేక మూవీ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న నబా నాటేశ్  కన్నడ కు చెందిన బ్యూటీనే. ఇలా ప్రస్తుతం కన్నడ కు చెందిన ఈ ముద్దు గుమ్మ లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: