ఆ క్రేజీ బ్యానర్లో మరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన అను ఇమాన్యుయల్..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి అను ఇమాన్యుయల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అను ఇమాన్యుయల్ ఊర్వశివో రాక్షసివో అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో అల్లు శిరీష్ హీరోగా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో , ఊర్వశివో రాక్షసివో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. అను ఇమ్మాన్యుయల్ ప్రస్తుతం రావణాసుర అనే మూవీ లో నటిస్తోంది. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తూ ఉండగా , సుధీర్ వర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తో పాటు ఈ ముద్దుగుమ్మ కార్తీ సరసన జపాన్ మూవీ లో కూడా హీరోయిన్ గ నటించబోతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లాంచనంగా ప్రారంభం అయింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కార్తీ సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు మరో క్రేజీ బ్యానర్ నుండి కూడా ఓ సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. జి ఏ టు పిక్చర్స్ బ్యానర్ లో ఈ ముద్దుగుమ్మ కు సినిమా ఆఫర్ ఆచినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా విడుదల అయిన ఊర్వశివో రాక్షసివో మూవీ కూడా జీ ఏ 2 పిక్చర్స్ బ్యానర్ లోనే తెరకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: