నచ్చిన భాష లో యశోద చూడొచ్చు... ఎలా అంటే ..!?

Anilkumar
తాజాగా 'యశోద' చిత్రబృందం ఒక ఏర్పాటు చేసింది.ఏంటంటే... తమ సినిమాను నచ్చిన భాషలో చూడొచ్చు అంటూ ఓ యాప్‌ను తీసుకొచ్చింది.అయితే  నిజానికి ఈ సినిమా ఒక్కటే కాదు.. యాప్‌లో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇక  'యశోద' టీమ్‌ ఈ యాప్‌ను ఇప్పుడు అందరికీ గుర్తు చేసింది. ఇక ఆ విషయం పక్కనపెడితే.. ఆ యాప్‌ ఏంటి, ఎలా పని చేస్తుందో చూద్దాం.ఇక ఓటీటీలో సినిమా చేసేటప్పుడు  మనకు నచ్చిన భాషను ఎంపిక చేసుకుని చూస్తాం.ఇక  థియేటర్లలోనూ ఇలాంటి ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేదే ఈ యాప్‌. 

అయితే దాని పేరే 'సినీ డబ్స్‌'. దీనిద్వారా ప్రేక్షకులు తమకు నచ్చిన భాషలో థియేటర్‌లోనే సినిమా చూడొచ్చు. అంటే ఇక మీరు థియేటర్‌లో 'యశోద' తెలుగు వెర్షన్‌ సినిమాకు వెళ్ళి.. ఆ యాప్‌లో హిందీలో సినిమాను వినొచ్చు అన్నమాట. ఇక ఈ యాప్‌ను ఎలా వాడాలి తదితర విషయాలను 'యశోద' టీమ్‌ ఓ పోస్ట్‌ ద్వారా తెలిపింది.ఇక సమంత ప్రధాన పాత్రలో హరి- హరీశ్‌ తెరకెక్కించిన 'యశోద' ఈ నెల 11న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజిలో విడుదల చేస్తామని టీమ్‌ చెప్పింది. తెలుగు, తమిళ భాషలనే కీలకంగా తీసుకుంది.

కాగా మిగిలిన భాషలను ఇప్పుడు 'సినీ డబ్స్‌' ద్వారా ఎంజాయ్‌ చేయొచ్చు.
సినీ డబ్స్‌ యాప్‌ను ఎలా వాడాలంటే..
* గూగుల్‌ ప్లే స్టోర్‌/ యాప్‌ స్టోర్‌ నుండి 'సినీడబ్స్‌' యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలి.
* మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నెంబరు, ఫేస్‌బుక్‌ ద్వారా యాప్‌లో లాగిన్‌ అవ్వాలి.
* ఆ తర్వాత యాప్‌కు లొకేషన్‌, మైక్రోఫోన్, ఫోన్‌ పర్మిషన్‌ లాంటివి చెయ్యాలి.
* లిస్ట్‌లో మీరు చూడాలనుకుంటున్న సినిమా టైటిల్‌ క్లిక్‌ చేసి ఆ వాయిస్‌ ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చెయ్యాలి.
* థియేటర్‌కు వెళ్లాక యాప్‌లో ఆ సినిమా ట్రాక్‌ను ప్లే చెయ్యాలి.
* అప్పుడు మీ మొబైల్‌లో మైక్రోఫోన్‌ ద్వారా సినిమా స్టార్ట్‌ అయ్యింది లేనిదీ యాప్‌ చూస్తుంది.
* తెర మీద సినిమా మొదలవ్వగానే మొబైల్‌లో ట్రాక్‌ ప్లే అవ్వడం ప్రారంభమవుతుందన్నమాట.
* అందుకు తగ్గట్టుగా వీడియో, ఆడియో సింక్‌ అయ్యేలా యాప్‌ చూసుకుంటుంది.

*ఇక  'యశోద' సినిమా విషయానికొస్తే.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఆడియో ట్రాక్స్‌ అందుబాటులో ఉన్నాయి.
*  అయితే రీసెంట్‌ విడుదలైన 'గాడ్‌ ఫాదర్‌', 'కార్తికేయ 2', 'సీతారామం', 'విక్రాంత్‌ రోణ', 'రాకెట్రీ' తదితర సినిమాలున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: