ఆ పని చేసాకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా.. హీరో విశాల్..!!

Anilkumar
సినీ ఇండస్ట్రీలో హీరో విశాల్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇక ఆయన తెలుగులోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కూడా, తనదైన శైలిలో దూసుకుపోతూ స్టార్ హీరోగా ఎదిగారు.కాగా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటారు. అయితే తాజాగా ఆయన మరో సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.ఇక వినోద్ కుమార్ డైరెక్షన్లో యాక్షన్ మూవీ చేస్తున్నారు హీరో విశాల్..అయితే రానా ప్రొడక్షన్ పథకంపై నందా సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.ఇక  ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నారు. 

అయితే  ఇక సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ వీడియో విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇదిలావుంటే హైదరాబాదులో లాటి టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చారు హీరో విశాల్. ఇక ఈ సందర్భంలోనే ఆయన మాట్లాడుతూ యాంకర్ అభినయ గురించి తెలుసుకోవాలని ఉంది అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.ఇక ఆ ప్రశ్న ఏంటయ్యా అంటే.. హీరో విశాల్ పెళ్లి గురించి.. తన పెళ్లి పై మొదటి నుంచి విశాల్ చెబుతున్న మాట కూడా ఇదే.. మరోసారి లాఠీ ఈవెంట్ లో కూడా చెప్పేశారు.అయితే  సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మించిన తర్వాతే నా పెళ్లి అనేది జరుగుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే  3500 కుటుంబాలు 30 సంవత్సరాల నుండి మేకప్ చిరిగిపోయిన డ్రెస్సులు వేసుకొని చిన్న చిన్న డ్రామాలు, నాటకాలు చేస్తూ బతుకుతున్నారు.అయితే వారందరూ బాగుండాలి..వారి కుటుంబాలు కూడా బాగుండాలని కోరిక నాకు ఉంది.కాగా వారికి బిల్డింగు కట్టించి పెన్షన్లు ఇప్పించి నా ద్వారా వారి లైఫ్ స్టైల్ కొంచెం మారేలా చూస్తాను.ఇక ఈ కళ నెరవేరాకే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసారు విశాల్.అయితే  ఆ బిల్డింగ్ ఓపెనింగ్ కి అందరిని పిలుస్తాను అలాగే నా పెళ్లికి కూడా మీ అందరిని పిలుస్తాను రావాలని అన్నారు.కానీ ఇక  అభినయతో పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: