Jr NTR న్యూ లుక్‌పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. ఏం అన్నాడంటే..!

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టూడెంట్ నెంబర్ 1 నుంచి నిన్నటి rrr సినిమా వరకు ఎన్టీఆర్ లుక్స్ లో ఎన్నో వేరియేషన్స్ చూశాం. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మరో డిఫరెంట్ లుక్‌తో అట్రాక్ట్ చేశారు ఈ నందమూరి వారసుడు.అయితే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్న సినిమా కోసం మరోసారి కొత్త తరహా గెటప్‌లోకి మారారు ఎన్టీఆర్. ఇక ఇందుకు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదిలావుండగా  తాజాగా ఈ లుక్ చూసిన సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్రేజీ రియాక్షన్ ఇచ్చారు.ఇకపోతే తన సోషల్ మీడియా  ఖాతాలో జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ షేర్ చేసిన బండ్ల గణేష్.. 

చూడటానికి అత్యద్భుతంగా ఉన్నారు తారక్ సార్ అని కామెంట్ చేశారు. అంతేకాదు  8కె ఈ కొత్త లుక్‌ని తానూ నిర్మించిన 'బాద్‌షా' లుక్‌తో పోల్చారు బండ్ల గణేష్.అయితే బండ్లన్న చేసిన ఈ పోస్ట్, ఆ పోలిక చూసి నందమూరి అభిమానులు పాజిటివ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తో మరో సినిమా చెయ్ బండ్లన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే మొత్తానికి ఎన్టీఆర్ కొత్త లుక్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఇక ఎన్టీఆర్ కొత్త రూపు రేఖలు చూసి అభిమానులు బాగుందంటూ మెచ్చుకుంటున్నారు.కాగా  గడ్డంతో కొంచెం బాద్‌షా తరహా గెటప్‌లో కెవ్వు కేక అనిపిస్తున్నారు ఎన్టీఆర్.

 అయితే తన 30వ సినిమాగా తెరకెక్కుతున్న కొరటాల శివ సినిమా కోసం పూర్తిగా ఇలా మేకోవర్ అయినట్టు కనిపిస్తోంది.ఇకపోతే సరికొత్త హెయిర్ స్టైల్, లైట్‌గా గెడ్డం, కళ్లకు షేడ్స్ ధరించి చాలా స్టైలిష్‌గా ఉన్న ఎన్టీఆర్ ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.అయితే  ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ ఆలిమ్ హకీమ్.. తారక్‌ను ఈ సరికొత్త లుక్‌లోకి మార్చారు.ఇక  ఓ కమర్షియల్ యాడ్ షూట్ కోసం ఎన్టీఆర్ ఈ కొత్త లుక్‌లోకి మారారనే టాక్ కూడా వినిపిస్తోంది.అయితే  ఈ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ జరుగుతోందని తెలుస్తోంది.ఇక ఏదేమైనా ఎన్టీఆర్ తాజా లుక్ మాత్రం జనాకర్షణ పొందుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: