కార్తికేయ సినిమా తులసీకి డార్లింగ్ శ్రీనుకి మధ్య సంబంధం ఏంటి..!!

Anilkumar
నటీనటుల వ్యవహారాలు బయటపడాలి అంటే కొన్ని ఇంటర్వ్యూలలో పలు ప్రశ్నలకు సమాధానం తెలియజేయక తప్పదు.అయితే  ఈ సమయంలోనే వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా బయటపడుతూ ఉంటాయి.ఇక ఇప్పటివరకు ఎంతోమంది నటీనటుల వ్యవహారాలు బయటపడ్డాయని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా కమెడియన్ ఆలీ చేసేటువంటి ప్రోగ్రాం ఆలీతో సరదాగా కార్యక్రమం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కాగా ఇందులో ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. 

 ఇప్పుడు తాజాగా ఈ ప్రోగ్రాం కి ఇద్దరు గెస్టులు రావడం జరిగింది.ఇక  వీరిని చూసిన ప్రేక్షకులు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు.అయితే ఎన్నో చిత్రాలలో తల్లి పాత్రలలో చేసిన సీనియర్ నటీమణి మాజీ హీరోయిన్ తులసి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ఇదిలావుంటే  రీసెంట్ గా వచ్చిన కార్తికేయ-2 చిత్రంలో కూడా అద్భుతమైన నటన ప్రదర్శించింది . ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఈమె మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆశ్చార్యాన్ని కలిగించాయి. ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాతో పాపులారిటీ అయ్యారు ప్రభాస్ శీను.అయితే  ఈ కార్యక్రమానికి కలిసి వీరిద్దరు గెస్ట్ లుగా రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

కాగా వీరు ఎంట్రీ ఇవ్వగానే అప్పట్లో డార్లింగ్ సినిమా చేసాం కదా అప్పుడు ఈవిడ తగిలింది అంటూ శ్రీను కామెంట్లు చేయడం జరిగింది.ఇకపోతే  అసలు ఏ ఉద్దేశంతో శ్రీను ఈ కామెంట్లు చేశాడా అని అందరూ నోరెళ్ళ పెడుతున్నారు.వీరిద్దరూ స్నేహితులా? లేకపోతే ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఏదైనా ఉందా? అంటూ పలువురు నెటిజన్లు ఈ ప్రోమో చూశాక పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే  ముఖ్యంగా తులసి వయసు 55 సంవత్సరాలు.. ప్రభాస్ శ్రీను వయసు 43 సంవత్సరాలు.  వీరిద్దరికీ ఉన్న కనెక్షన్ ఏంటి? వీరిద్దరినీ ఆలీ ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.ఈ విషయంపై పూర్తి వివరణ కావాలి అంటే పూర్తి ఎపిసోడ్ రావాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: