వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న లావణ్య త్రిపాఠీ...!!

murali krishna
లావణ్య త్రిపాఠి ఒక రూపదర్శి, సినీ నటి. తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్రరంగం లోకి ప్రవేశిం చింది.ఆమెకు చిన్నప్ప టి నుంచీ గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేది. కానీ తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి తరువాత మోడలింగ్ లో, టీవీ కార్యక్రమాల్లోకి ప్రవేశించింది. 2006 లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకున్నది. అయితే ఈమే అటు అందం, ఇటు అభినయ సామర్థ్యం పుష్కలంగా ఉన్న నటి లావణ్య త్రిపాఠి.
దక్షి ణాది భాషల్లో విశేష రీతిలో అవకా శాలు అందు కుంటూ ముందుకు దూసు కుపోతోంది. తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మంజునాథ దర్శకత్వంలో లావణ్య సైకలా జికల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. అటు, తమిళంలో హీరో అధర్వతో నటిస్తున్న సినిమా రెండు పాటలు మినహా పూర్తయింది. ఓటీటీ రంగంలోనూ లావణ్య తనదైన ముద్ర వేసేందుకు ప్రయ త్నిస్తోంది.
ఆమె నటించిన జీ5 'పులి మేక' థ్రిల్లర్ వెబ్ సిరీస్ కొనా వెంకట్ దర్శక త్వంలో షూటింగ్ పూర్తి చేసు కుని పోస్ట్ ప్రొడ క్షన్ దశలో ఉంది. ఒక తెలుగు సినిమా, ఒక తమిళ సినిమా, ఓ తెలుగు వెబ్ సిరీస్ తో వైవిధ్యంగా ముందుకెళ్తున్న లావణ్య త్రిపాఠి త్వరలోనే రెండు ప్రాజెక్టులు అనౌన్స్ చేయనుంది. నవీన్ చంద్ర సరసన 'అందాల రాక్షసి' చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయిన లావణ్య త్రిపా ఠిఆ తర్వాత భలే భలే మగాడివోయ్, మనం, సోగ్గాడే చిన్ని నాయన, ఉన్నది ఒకటే జిందగీ, అర్జున్ సుర వరమ్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చు కుంది. ఈ ఏడాది ఆమె మైత్రీ మూవీ మేకర్స్ బ్యా నర్ లో 'హ్యాపీ బర్త్ డే' చిత్రంలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: