సందీప్ కిషన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వస్తుందా!!

P.Nishanth Kumar
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మైకేల్ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ తాజాగా ప్రకటించబడింది. చిత్ర బృందం దీనికి సంబంధించిన ప్రకటన ఇచ్చింది. డిసెంబర్ 30వ తేదీన ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సందీప్ కిషన్ పాన్ ఇండియా హీరోగా భారీ స్థాయిలోనే రిస్క్ చేస్తున్నారు ఈ సినిమా తో.

తెలుగులో ఇప్పటిదాకా ఒక సరైన విజయాన్ని కూడా అందులో లేకపోయినా సందీప్ కిషన్ ఏకంగా భారీ ప్రాజెక్టు చేయడం అంటే ఎవరైనా ఆశ్చర్య పడిపోవాల్సిందే. చిన్న చిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆనందించ లేకపోయిన సందీప్ కిషన్ ఈ సినిమాతో ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి. వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన చాలా అప్డేట్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరిచాయి. సినిమా పట్ల మంచి అంచనాలను కూడా పెంచాయి. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ఏవిధంగా ఉంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉండగా దానికి తగ్గట్టుగానే అప్డేట్లు కూడా ఉండడంతో అంచనాలు పెరిగిపోయాయి.

తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 30వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి విజయాన్ని అందుకోవాలని సందీప్ కిషన్ భావిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలను కూడా చేస్తున్న సందీప్ కిషన్ దీని ద్వారా విజయాన్ని అందుకొని హీరోగా నిలదుకోవాలని భావిస్తున్నాడు. మరి ఇండస్ట్రీలో పాతుకు పోవాలంటే విజయాలు ఎంతగానో అవసరం అయిన నేపథ్యంలో ఈ చిత్రం ద్వారా సందీప్ కిషన్ విజయాన్ని అందుకొని ప్రేక్షకులను అల్లరిస్తాడా అనేది చూడాలి. యువతలో మంచి క్రేజీ ఉన్న ఈ హీరో వరుస సినిమాలు చేస్తున్న కూడా విజయాలను అందుకోలేకపోవడమే ఆయన క్రేజ్ రాకపోవడానికి కారణం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: