చిరంజీవి బాలయ్యల నెంబర్ గేమ్ లో ఇరుక్కున్న మైత్రి మూవీస్ ?

Seetha Sailaja
ఒకప్పుడు టాప్ హీరోలతో సినిమాలు తీసే సురేష్ ప్రొడక్షన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి భారీ నిర్మాణ సంస్థలు ప్రస్తుతం పెరిగిపోయిన సినిమాల నిర్మాణ వ్యయం చూసి తమకు వర్కౌట్ కాదని సినిమాలు తీయడం పూర్తిగా తగ్గించివేసారు. అయితే మైత్రీ మూవీస్ సంస్థ మటుకు ఎలాంటి భారీ సినిమాలు అయినా తీయడానికి ముందుకు వస్తున్న పరిస్థితులలో టాప్ హీరోలు అంతా తమ డేట్స్ ను మైత్రీ మూవీస్ సంస్థకు ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు.

సాధారణంగా సంక్రాంతికి విడుదల అయ్యే భారీ సినిమాలను ఒకొక్క ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తూ ఉంటుంది. అయితే ఈసారి సంక్రాంతి రేసుకు రాబోతున్న ‘వాల్టేర్ వీరయ్య’ ‘వీర సింహారెడ్డి’ సినిమాలు రెండిటిని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించడమే కాకుండా తమ సినిమా పై తాము నిర్మించిన మరో భారీ సినిమాను పోటీగా విడుదల చేస్తూ ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ సాహసమే మైత్రీ మూవీస్ కు తలనొప్పులు తెచ్చిపెట్టే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనికికారణం బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ మూవీకి సంబంధించిన మొదటి పాట విడుదల అవుతుంది అంటూ మైత్రీమూవీస్ సోషల్ మీడియాలో ప్రకటించిన కొద్ది సేపటికే మెగా అభిమానులు ‘వాల్టేర్ వీరయ్య’ మొదటి పాట విడుదల ఎప్పుడు అంటూ మెగా అభిమానుల ఒత్తిడి మైత్రీ మూవీస్ పై పెరిగి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కేవలం ఒక పాట గురించి ఇలా నందమూరి మెగా అభిమానుల మధ్య చిన్నవార్ మొదలయితే ఇక రానున్న రోజులలో ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ లో ఏఒక్క సినిమాకు చిన్న తేడా కనిపించినా అది నందమూరి మెగా ఫ్యాన్స్ వార్ గా మారే అవకాశం ఉంది అంటున్నారు. సాధారణంగా సంక్రాంతి రేస్ లో చిరంజీవి బాలయ్యల మధ్య పోటీ అంటే వార్ ఒక రేంజ్ లో ఉంటుంది. మరి ఇలాంటి వార్ ను మైత్రీ మూవీస్ ఎలా తట్టుకుంటుందో చూడాలి అంటు కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: