బన్నీ భజన.. శ్రుతి మించింది గా!!

P.Nishanth Kumar
అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఊర్వసివో రాక్షసివో అనే సినిమా యొక్క సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగింది. అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి వారికి మంచి ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందిస్తుంది. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. ఆద్యంతం కామెడీని పండిస్తూ ఈ సినిమా అందరిని అలరించింది అని చెప్పవచ్చు. దానికి తోడు రొమాంటిక్ సీన్లు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరిచాయి. చాలా రోజుల తర్వాత ఒక రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ ను చూశామని ప్రేక్షకులు చెబుతూ ఉండడం విశేషం

అయితే ఈ సినిమా భారీ సక్సెస్ కావడంతో దీనికి సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ను చిత్ర బృందం హైదరాబాదులో నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రావడం జరిగింది. ఒకవైపు సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ మరియు ఇంకొక వైపు ఈ సినిమాలోని హీరో అల్లు శిరీష్ బన్నీ కి తమ్ముడు కావడంతో ఈ కార్యక్రమానికి ఆయన రావడం జరిగింది. అయతే ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బన్నీ భజన చేయటం ఆయన గురించి మాటిమాటికి పొగుడుతూ ఉండడం కొంతమంది ప్రేక్షకులకు విసుగు తెప్పించింది అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

పొగడడం వరకు ఓకే కానీ భజన చేయడం మాత్రం నిజంగా చాలా ఇబ్బందిని కొని తెచ్చిపెడుతుంది అని చెబుతున్నారు. ఆ విధంగా అల్లు అర్జున్ భజన బృందాన్ని పక్కన వేసుకొని తిరగడం దేనికి దారితీస్తుందో చూడాలి. ప్రస్తుతం ఆయన పుష్ప రెండవ భాగానికి సంబంధించిన షూటింగ్ చేయబోతున్నాడు. పుష్ప మొదటి భాగం అందుకున్న సంచలన విజయంతో ఆయన దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మార్కెట్ ను కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: