త్రివిక్రమ్ పై ప్రెషర్ పెరుగుతుందా!!

P.Nishanth Kumar
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా ఆగిపోవడం ఇప్పుడు ఈ దర్శకుడు పై కొంత ప్రెషర్ నెలకొంటుంది అని చెప్పాలి. కథల ఎంపికలో సినిమాలను చేసే విషయంలో మహేష్ బాబు ఎంత పక్కాగా ఉంటున్నాడో గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా సదరు సినిమాను క్యాన్సల్ చేయడంలో అసలు ఆలోచించడం లేదు.

 మేటి దర్శకుడైన సుకుమార్ సినిమాను సైతం మధ్యలో వదిలేసిన మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా ను ఆ విధంగా చేయబోతున్నాడు అనే వార్తలు రావడం చిత్ర బృందాన్ని ఎంతో కలవరపెడుతుంది అని చెప్పాలి. వాస్తవానికి త్రివిక్రమ్ సినిమాను ఓకే చేసే విషయం లో చాలా సమయాన్ని తీసుకున్నాడు మహేష్ బాబు. అసలు ఈ సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలు చాలామందికి కలిగాయి. ఫైనల్ గా త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ తో మహేష్ బాబును మెప్పించినా కూడా ఎందుకో షూటింగ్ విషయంలో మాత్రం ఆయనను మెప్పించ లేకపోతున్నాడని వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి

గతంలో మహేష్ బాబుతో రెండు సినిమాలు తీసిన అనుభవం ఉన్న త్రివిక్రమ్ ఈ సినిమా ద్వా రా ఆయన నుంచి ఎన్నో ఆంక్షలు ఎదుర్కొంటున్నాడట. ప్రతి సీన్ కూడా మహేష్ బాబు దగ్గరుండి చూసుకోవడంతో కొన్ని షాట్లు నచ్చకపోవడంతో ఈ విధమైన బేధాభిప్రాయాలు వారిద్దరిలో కలుగుతున్నాయట. ఆ విధంగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా దానిని పూర్తిగా మరొకసారి రీ సూట్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తు న్నాయి.  దానికి కార ణం ఆ అవుట్ ఫుట్ మహేష్ బాబుకు నచ్చకపోవడమేనట. దీన్ని బట్టి మహేష్ బాబుతో ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తాడో అన్న ప్రెషర్ త్రివిక్రమ్ లో రోజు రోజు కు ఎక్కువ అయిపోతుంది అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: