"విక్రాంత్ రోనా" మూవీకి మొదటిసారి తెలుగులో వచ్చిన "టిఆర్పి" రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
కన్నడ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిచ్చ సుదీప్ ఇప్పటికే నేరుగా తెలుగు లో ఈగ , బాహుబలి ,  సైరా నరసింహా రెడ్డి వంటి మూవీ లలో కీలక పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కిచ్చ సుదీప్ "విక్రాంత్ రోనా" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కన్నడ తో పాటు తెలుగు , తమిళ , హిందీ ,  మలయాళ భాషల్లో కూడా ఒకే రోజు విడుదల అయింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ మూవీ కన్నడ , తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల్లో విడుదల అయింది.

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో విక్రాంత్ రోనా  మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కాయి.  ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ ను సాధించుకున్న విక్రాంత్ రోనా మూవీ కొన్ని రోజుల క్రితమే తెలుగు లో బుల్లి తెర పై ప్రసారం అయింది. ఈ మూవీ సాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ దక్కించుకుంది. స్టార్ మా చానల్ వారు కొన్ని రోజుల క్రితమే విక్రాంత్ రోనా మూవీ ని తెలుగు లో ప్రసారం చేయగా ,  ఈ మూవీ మొట్ట మొదటి సారి బుల్లి తెర పై ప్రసారం అయినప్పుడు 3.51 "టి ఆర్ పి" ని సాధించింది. డబ్బింగ్ మూవీ కి మొదటి సారి ఈ రేంజ్ లో "టి ఆర్ పి" రావడం చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: