"ఓటిటి" ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతున్న "కృష్ణ వ్రిందా విహారి" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి నాగ శౌర్య తాజాగా కృష్ణ  వ్రిందా విహారి అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. షిర్లే సెటియా ఈ మూవీ లో నాగ శౌర్య సరసన హీరోయిన్ గా నటించింది. ఈ ముద్దుగుమ్మ కృష్ణ వ్రిందా విహారి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. షిర్లే సెటియా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపు ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. కృష్ణ వ్రిందా విహారి మూవీ కి అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ చేసిన ప్రమోషన్ లు ,  అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంత గానో అలరించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని  సొంతం చేసుకున్న ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కి ఎంట్రీ ఇచ్చింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో ఈ మూవీ వచ్చిన తర్వాత నుంచి వారం రోజులు కంటిన్యూస్ గా ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానం ట్రెండింగ్ లో నిలవడం విశేషం. ఇలా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోతుంది. ఈ మూవీ కి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా ,  ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: