మార్చి లో కాదు.. ఆది పురుష్ రిలీజ్ మంత్ ఎప్పుడంటే?

P.Nishanth Kumar
ప్రభాస్ హీరో గా నటిస్తున్న అది పురుష్ సినిమా పోస్ట్ ఫోన్ అవడం ఎవరు కూడా దిగమింగు కోలేకపోతున్నారనే చెప్పాలి. సంక్రాంతికి విడుదల కాబోతుందని చాలా రోజుల నుంచి చెప్పి ఇప్పుడు సడెన్ గా ఆ సినిమా ను వాయిదా వేయడం అందరిని నిరాశపరుస్తుంది అని చెప్పాలి. ఏదేమైనా ఈ సినిమా నుంచి విడుదల అయినా అప్డేట్ లు ప్రేక్షకులను ఏ స్థాయి లో అలరించాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ తన పుట్టినరోజు సందర్భంగా ఓస్పెషల్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయాగా అది సినిమాపై అంచనాలను వేరే స్థాయి లో పెంచింది. ఆ తర్వాత టీజర్ సినిమా కోసం ఎంతో ఎదురుచుసేలా చేసింది.
మరి ఇంతటి స్థాయి లో అంచనాలను కలిగిన ఈ సినిమా వాయిదా పడడం నిజంగా అందరిని నిరాశపరుస్తుంది.  అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ను వేసవి లో విడుదల చేయడానికి రంగం సిద్ధం అవుతుందని చెబుతున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందగా ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోపైల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమయ్యారు. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీ పార్మేట్ లో వచ్చే ఈ సినిమా మర్చి లో రావడం లేదనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మే లో విడుదల  చేయాలనీ భావిస్తున్నారట. మే 12 వ తేదీన ఈ సినిమా ను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మరి దీని గురించి తొందరలోనే ఓ అధికారిక ప్రకటన వస్తుందా అనేది చూడాలి. ఇక తెలుగు లో సంక్రాంతి కి చాలా సినిమాలే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: