హీరోయిన్ పూర్ణ తన హల్దీ ఫంక్షన్ కోసం ఎన్ని లక్షలు ఖర్చు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Anilkumar
పూర్ణ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.ఇక  అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఆ తర్వాత తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ..నవ్విస్తూ.. ఎంటర్టైన్ చేస్తూ.. కొన్ని సినిమాల్లో భయపెడుతూ.. తన అభిమానులను పెంచుకుంది. అయితే ఇక హీరోయిన్ గా ఆమె ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో బుల్లితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఢీ షోలో జడ్జిగా అడుగు పెట్టింది.

ఇక ముద్దుగుమ్మ  పూర్ణ ఈ మధ్యనే నేను పెళ్లి చేసుకున్నాను అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. వాస్తవానికి పూర్ణ పెళ్లి ఎప్పుడో ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.  పెళ్లి నవంబర్ లో ఉంటుంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పి ఎవరికీ తెలియకుండా జూన్ లోనే కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకొని దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన దివాళి సందర్భంగా తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చి బిగ్ షాక్ ఇచ్చింది. అయితే  ఈ విషయం తెలిసిన సెలబ్రిటీలు,ప్రేక్షకులు, అభిమానులు అందరూ ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు.

ఇదిలావుంటే ఇక ఈ విషయం పక్కన పెడితే.. పూర్ణ తన హల్దీ ఫంక్షన్ కోసం ఏకంగా 30 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇక ఈ ముద్దుగుమ్మ ఆ హల్దీ ఫంక్షన్ కి ఖర్చైనా 30 లక్షలు కూడా స్వయంగా తన భర్తనే ఇచ్చారట. ఇకపోతే 30 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఇక ఆ డబ్బులతో ఓ మామూలు మనిషి తన ఇంట్లో రెండు పెళ్లిళ్లు చేయొచ్చు అంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్స్. అయితే ప్రస్తుతం ముద్దుగుమ్మ పూర్ణ హల్దీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: