విశ్వక్ సేన్ హిట్టు కొట్టాలంటే...!!!

murali krishna
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు వస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే మాస్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఒకడు.పేరుకు మాస్ కా దాస్ అయినా.. అతడు వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తున్నాడు. సినిమా సినిమాకూ తేడాను చూపిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే విశ్వక్ ఇటీవలే ''ఓరి దేవుడా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. క్రేజీ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు తొమ్మిది రోజుల్లో ఎంత వచ్చింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? మీరే చూడండి!


విభిన్నమైన కాన్సెప్ట్‌ మూవీగాటాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో అశ్వత్ మరిముత్తు తెరకెక్కించిన చిత్రమే 'ఓరి దేవుడా'. ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించగా.. వెంకటేష్ కామియో రోల్‌ చేశారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై పరవ్ వీ పొట్లూరి నిర్మించారు. లియాన్ జేమ్స్ దీనికి సంగీతం ఇచ్చారు. ఇది ఓ మై కడవులే అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా వచ్చింది.

ఓరి దేవుడా బిజినెస్ వివరాలుతెలుగు రాష్ట్రాల్లో విశ్వక్ సేన్‌కు ఇప్పుడిప్పుడే మార్కెట్ పెరుగుతూ వస్తోంది. దీనికితోడు అతడి తాజా చిత్రం 'ఓరి దేవుడా'పై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ అయింది. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి రోజు రూ. 90 లక్షలు, రెండో రోజు రూ. 66 లక్షలు, 3వ రోజు రూ. 74 లక్షలు, 4వ రోజు రూ. 90 లక్షలు, 5వ రోజు రూ. 39 లక్షలు, 6వ రోజు రూ. 26 లక్షలు, 7వరోజు రూ. 18 లక్షలు, 8వ రోజు రూ. 9 లక్షలు వచ్చాయి. 10వ రోజు మాత్రం ఇది రూ. 12 లక్షలు రాబట్టింది.

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది9 రోజుల్లో అంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ఓరి దేవుడా' మూవీ మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 1.81 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో రూ. 48 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 1.95 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ మూవీ రూ. 4.24 కోట్లు షేర్‌తో పాటు రూ. 7.30 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలాతెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో రూ. 4.24 కోట్లు వసూలు చేసిన విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 11 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 63 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.98 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.00 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు రూ. 4.98 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.02 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: