సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుదీర్ బాబు ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో మూవీ లలో హీరో గా నటించి ,  తన కంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం సుధీర్ బాబు "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి ,  సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించగా ,  ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
 

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ బాబు కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న ఒక సినిమాకు సంబంధించిన టైటిల్ ను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న సినిమాకు హరోం హర అనే టైటిల్ ను మూవీ యూనిట్ ప్రకటించింది.  అలాగే ది రివల్ట్ అనే క్యాప్షన్ ను కూడా ఈ మూవీ టైటిల్ కు పెట్టారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జ్ఞాన సాగర్ ద్వారక ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , సుమంత్ జి నాయుడు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: