తమిళ్ నాడు లో కుష్బూ కీ అన్యాయం జరిగింది అంటా మరీ..!!

murali krishna
ఈ మధ్యకాలంలో రాజకీయాలలో హుందాతనం లేకుండా పోతోంది అని చెప్పొచ్చు. ఒకరి మీద ఒక విమర్శల వర్షం కురిపించుకోవడమే కాకుండా అవతలి వాళ్ళ కుటుంబ సభ్యులను సైతం అసభ్యమైన పదజాలంతో దూషించడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు.
ఈ పరిస్థితులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం లో ఎక్కువగా కనిపిస్తున్నాయి, అయితే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నేత. తమిళనాడుకు చెందిన డీఎంకే నేత సాదిక్ తాజాగా బీజేపీలో ఉన్న సినీ నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు ఇలా చేశారు.
తమిళనాడు బీజేపీలో ఉన్న కుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్ వంటి వారందరూ ఐటమ్స్ అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా ఇందులో కుష్బూ పెద్ద ఐటమ్ గాళ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వివాదస్పదంగా మారాయి. ఆయన ఇంకా మాట్లాడుతూ అమిత్ షా తల మీద వెంట్రుకైనా మొలుస్తుందేమో కానీ తమిళనాడులో కమలం మాత్రం వికసించదని అన్నారు. ఇక తన మీద చేసిన ఘాటు వ్యాఖ్యలపై సినీనటి, బిజెపి నేత కుష్బూ సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు  మరీ
ఈ నెపద్యంలో మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై ఒక సాటి మహిళగా బహిరంగ క్షమాపణలు చెబుతున్నామని డిఎంకె సీనియర్ నేత స్టాలిన్ సోదరి కనిమొలి  పేర్కొన్నారు. స్టాలిన్ ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడారని ఆమె అన్నారు. ఇక ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో సాదిక్ కూడా క్షమాపణలు కోరారు. తాను ఏ నేతను బాధ పెట్టాలని ఉద్దేశంతో అలా అనలేదని ఆయన అన్నారు.
కుష్బూతో సహా ఏ ఒక్క రాజకీయ అనేది  ఎవ్వరినీ బాధపెట్టాలని ఉద్దేశం తనకు  ఏ మాత్రం లేదని గతంలో ఈ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతున్నానని సాదిక్ అన్నారు మరీ. అయితే బీజేపీ తెలంగాణ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై డీఎంకే మంత్రులు, పందులు, కుక్కలు జంతువులు అన్నారని జర్నలిస్టులను  తరచూ గా కోతులతో పోల్చారని మరి బిజెపి నేతలు ఈ విషయం మీద ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: