వందరోజులు పూర్తి చేసుకున్న విక్రమ్...!!

murali krishna
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ జూన్ 3, 2022న ప్రేక్షకుల ముందు కు రాగా, ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఇప్పుడు 100 రోజులు పూర్తి చేసుకుందటా..
కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించి న యాక్షన్ డ్రామా లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం థియేటర్ల లో విజయవంతం గా రన్ అవుతోంది. అంతే కాకుండా బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతోంది. అభిమానుల ఆదరణ తో ‘విక్రమ్’ 100 రోజులు పూర్తి చేసుకున్నందు కు చాలా సంతోషం గా ఉందని కమల్ హాసన్ అన్నారు. విక్రమ్ సక్సెస్‌ లో భాగమైన ప్రతి ఒక్కరికీ కమల్‌ తన హృదయపూర్వ క కృతజ్ఞతలు తెలిపారటా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించి న ఈ చిత్రంలో అర్జున్ దాస్, కాళిదాస్ జయరామ్, నరేన్, శివాని మరియు మైనా నందిని వంటి అనే క మంది తారలు కూడా ఉన్నారు.

కమల్ హాసన్ ‘విక్రమ్’లో రా ఏజెంట్‌గా పవర్-ప్యాక్డ్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య, నరేన్, గాయత్రీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారటా.. కమల్ కెరియర్ లోనే చెప్పుకోదగి న నిలిచి న విక్రమ్ సినిమా పలు సెంటర్స్ లో 100 రోజుల ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భం గా చెన్నై లోని కలైవనార్ అరంగం వేదికగా 100 రోజుల ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేశారు మేకర్స్‌. నవంబర్ 7వ తేదీన ఈ వేడుకను జరపనున్నారు చిత్ర యూనిట్‌. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: