కాంతారని ఆకాశానికి ఎత్తేసిన సూపర్ స్టార్?

murali krishna
ప్రస్తుతం కాంతార సినిమా నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30న ఈ సినిమా కన్నడలో మొదలైంది.ఇంకా దేశంలోని చాలా చోట్ల కాంతార సినిమా మార్మోగిపోతూనే ఉంది.తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో కాంతారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విడుదలైన అన్ని చోట్లా కాంతారా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక కొంత మంది రిషభ్ శెట్టి నటనకు ఆస్కార్ రావాల్సిందే అని అంటున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ రిషభ్ శెట్టి తన సత్తాను చాటుకున్నాడు. కలెక్షన్లలో కాంతార కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.కేవలం 15 కోట్ల లోపు నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు రెండొందల కోట్లను కొల్లగొట్టేసింది. అలా కన్నడలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. లాభాలను ఈ రేంజ్‌లో తీసుకొచ్చిన చిత్రం మరొకటి లేదు. ఐఎండీబీ ర్యాంకుల్లో అయితే కాంతారా నెంబర్ వన్ స్థానంలో ఉంది. అలా కేజీయఫ్ సినిమా రికార్డులన్నింటినీ కాంతార బద్దలు కొడుతోంది. కేవలం మౌత్ టాక్‌తోనే కాంతార సినిమా ఈ రేంజ్‌ ప్రభంజనం క్రియేట్ చేసింది.ఎక్కడా కూడా అతి ప్రమోషన్స్ లేవు. సినిమాను హైప్ చేసి చెప్పలేదు.
కమర్షియల్ అంశాల జోలికి పోలేదు. తెలుగులో కాంతారా సినిమాబ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రెండు కోట్లకు గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తీసుకుందని తెలుస్తోంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే దాదాపు ఇరవై కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమాని చూసిన తలైవా ఇండియన్సూపర్ స్టార్ కాంతారా రివ్యూ ఇచ్చేశారు.ఏమీ తెలియకపోవడమే.. ఎంతో తెలియడం అన్నట్టుగా ఈ సినిమాలో అద్భుతంగా చూపించేశారు.. కాంతారా చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నటుడిగా, డైరెక్టర్‌గా రిషభ్ శెట్టికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కాంతారా సినిమా అనేది ఇండియన్ సినిమాల్లో మాస్టర్ పీస్.. సినిమా టీంకు కంగ్రాట్స్ అన్నారు .దీనిపై రిషభ్ శెట్టి స్పందించాడు. మీరు ఇండియాకు సూపర్ స్టార్.. చిన్నతనం నుంచి మీకు నేను అభిమానిని.. సహజత్వంతో కూడుకున్న సినిమాలు చేయాలని మీరే ఇన్ స్పైర్ చేశారు.. థాంక్స్ సర్ అంటూ ఇలా తన అభిమానాన్ని బయటపెట్టేశాడు రిషభ్ శెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: