ఆ హీరోలతో పోలిస్తే సందీప్ కిషన్ ఓకే!!

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలు పాన్ ఫాలోయింగ్ బాగా ఉన్న హీరోలు గట్టిగా చూస్తే ఓ ఏడుగురు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత హీరోలందరూ కూడా హిట్ వస్తేనే వారికి పేరు వస్తుంది లేదంటే వారి సినిమాను ఎవరూ కూడా పట్టించుకోరని చెప్పాలి. అలాంటి హీరోలతో పోలిస్తే సందీప్ కిషన్ ఓకే అని ఓ సినిమా విశ్లేషకుడు చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. చోటా కె నాయుడు వారసుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన సందీప్ కిషన్ పరిచయమైన దగ్గరినుంచి విభిన్నమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఇప్పటివరకు అలరిస్తూ వచ్చారు

ప్రస్తుతం ఆయన హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైఖేల్ అనే యాక్షన్ భరితమైన సినిమాను దాదాపుగా పూర్తి చేసిన సందీప్ కిషన్ ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశాడు. దానికి ప్రేక్షకులలో మంచి స్పందన వచ్చింది. వాస్తవానికి సరైన విజయం అందుకోలేక పోయిన సందీప్ కిషన్ ఇంతటి భారీ స్థాయి సినిమాను చేస్తారని ఎవరూ కూడా కలలో కూడా ఊహించలేదు .అయినా తన దృఢ సంకల్పంతో ఇలాంటి సినిమాను చేయడం సందీప్ కిషన్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమా  టీజర్ ద్వారానే ఆయనకు ప్రేక్షకులలో మంచి ఆసక్తి ఏర్పడింది.  ఇప్పుడు టీజర్ ఆసక్తిని రెట్టింపు చేసింది అని చెప్పాలి

త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయబోతుండగా ఈ చిత్రం విజయం సాధిస్తే తప్పకుండా సందీప్ కిషన్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని చాలా మంది చెబుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల అవుతున్న నేపథ్యంలో మంచి కథ ఉంటే తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని చాలామంది చెబుతున్నారు. తప్పు ఒప్పో సందీప్ కిషన్ వరుస సినిమాలను చేసి ప్రేక్షకులలో కనబడుతూ వారిని అలరిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయనకు ఇప్పుడు ఈ సినిమాకు ఇంతటి క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: