గౌతమ్ తిన్ననూరి కథలో మార్పులు... చేర్పులు సూచించిన విజయ్ దేవరకొండ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన గౌతమ్ తిన్ననూరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గౌతమ్ తిన్ననూరి , సుమంత్ హీరోగా తెరకెక్కిన మళ్లీ రావా మూవీ తో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మళ్ళీ రావా మూవీ ద్వారా ఈ దర్శకుడికి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి ,  నాని హీరోగా జెర్సీ మూవీ ని తెరకెక్కించాడు. క్రికెట్ ప్రధాన నేపథ్యంగా తెరకెక్కిన జెర్సీ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ,  ప్రేక్షకుల నుండి ,  విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను కూడా అందుకుంది.

ఆ తరువాత ఈ దర్శకుడు జెర్సీ మూవీ నే హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ అనే పేరు తోనే రీమేక్ చేశాడు. కాకపోతే ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా  గౌతమ్ తిన్ననూరి , విజయ్ దేవరకొండ కు ఒక కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన విజయ్ దేవరకొండ , గౌతమ్ తిననూరి దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పినట్లు , కాక పోతే కథలో కొన్ని మార్పులు ... చేర్పులను సూచించినట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ "ఖుషి" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే విజయ్ దేవరకొండ , గౌతమ్ పున్నలూరి కాంబినేషన్ మూవీ ప్రారంభం కాబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: