ప్రభాస్ ఫాన్స్ అత్యుత్సాహం.. థియేటర్లో అగ్నిప్రమాదం?

murali krishna
ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.
ఆయన నటించిన బిల్లా సినిమాని రీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లలో అయితే పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి కూడా రావడంతో పెద్ద ఎత్తున థియేటర్ల బయట బాణాసంచా పేలుస్తూ ప్రభాస్ అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.
అయితే ఈ సందర్భంగా తాడేపల్లి గూడానికి సంబంధించిన వెంకట్రామా అనే థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ బిల్లా సినిమా రిలీస్ సందర్భంగా హంగామా సృష్టించారు ప్రభాస్ పుట్టిన రోజు నేపద్యంలో బిల్లా సినిమా రిలీజ్ చేయడంతో అభిమానులు తమ అభిమానాన్ని కాస్త వెరైటీగా చాటుకోవాలని భావించారు. సాధారణంగా బాణాసంచా అంటే థియేటర్ బయట రోడ్లమీద కాలుస్తారు కానీ ప్రభాస్ అభిమానులు థియేటర్ లోపల కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు.
కానీ అది బెడిసి కొట్టింది, థియేటర్ లో వెలిగించిన బాణాసంచా అక్కడ ఉన్న సీట్లకు అంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ సీట్లన్నీ దగ్ధమైన పరిస్థితి కనిపించింది. దాదాపుగా థియేటర్ కూడా దగ్ధమయ్యే పరిస్థితిలో దగ్గరలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అప్పటికప్పుడు వచ్చిన ఫైర్ ఇంజన్ అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని థియేటర్ యాజమాన్యంతో అలాగే షో నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నారు.
ఇక ప్రభాస్ 2009వ సంవత్సరంలో నటించిన బిల్లా సినిమా మంచి టాక్ తెచ్చుకుంది కానీ అప్పట్లో ఈ సినిమాకి పెద్దగా వసూళ్లు అయితే రాలేదు. కానీ ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో మిగతా హీరోల అభిమానుల లాగానే ప్రభాస్ అభిమానులను కూడా సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో గోపికృష్ణ మూవీస్ సంస్థ మళ్ళీ ఈ సినిమాని రీ రిలీజ్ చేసింది. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్ని డయాబెటిక్ పేషెంట్ల కోసం వినియోగించబోతున్నారు.
ఇక ఈ సినిమాకు మెహర్ రమేష్ డైరెక్టర్ గా వ్యవహరించగా అనుష్క హీరోయిన్ గా నటించింది, కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా దేవి థియేటర్ లో విడుదలైన నేపథ్యంలో ప్రభాస్ సోదరి ప్రసీదా ఈ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ ఇద్దరూ ఆ థియేటర్ కి వెళ్లి సినిమాను వీక్షించి అభిమానులతో కలిసి సందడి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: