యంగ్ హీరో మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీ కాంత్ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇలా హీరోగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

ఈ మూవీ లో రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండగా , మిల్కీ బ్యూటీ తమన్న ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించే అవకాశం ఉంది అని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం రజనీ కాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా , ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. జైలర్ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇలా జైలర్ మూవీ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న సూపర్ స్టార్ రజనీ కాంత్ మరో మూవీ లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య రజినీ కాంత్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో యంగ్ హీరో అథర్వ తో మూవీ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ లో అయితే రజనీ కాంత్ ఒక చిన్న పాత్రలో కనిపించనున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: