సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

murali krishna
ఒకప్పుడు ఒక సినిమా హిట్ అని చెప్పడానికి ఆ మూవీ ఎన్ని రోజులు ఆడింది అనే దానిని పరిగణలోకి తీసుకొని చెప్పేవారు. ఆ తర్వాత ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు ఎన్ని కేంద్రాల్లో ఆడాయి అనే దాని పై సినిమా గొప్పతనం డిసైడ్ చేసేవారు.టీవీలు లేని రోజుల్లో, స్మార్ట్ ఫోన్ లు, ఓటీటీలు లేని రోజుల్లో ఇది సాధ్యపడేది. సీడీ లు, వి సి డి లు ఉన్నప్పటికీ వాటి ప్రభావం ధియేటర్ లో రన్ అవుతునన్ సినిమా పై పడేది కాదు.
అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్ని రోజులు ఆడింది అనేది. కాదు ఎంత కలెక్ట్ చేసింది అనేదాని పైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. గత 15 ఏళ్ళుగా ఇదే పద్దతి నడుస్తుంది.ఇప్పుడు 50 రోజులు ఆడే సినిమాలే కనిపించడం లేదు. అయితే గతంలోకి వెళ్లి ఎక్కువ సెంటర్స్ లో 175 రోజులు ఆడిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో టాప్ 10 ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) పోకిరి :
మహేష్ బాబు - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. షిఫ్ట్ లు తీసేస్తే 48 కేంద్రాల్లో ఆడింది.
2) సింహాద్రి :
ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. షిఫ్ట్ లు తీసేస్తే 52 కేంద్రాలు.
3) ఇంద్ర :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 35 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. షిఫ్ట్ లు తీసేస్తే 31 కేంద్రాలు.ఇది కూడా ఇండస్ట్రీ హిట్టు మూవీ.
4) సమరసింహారెడ్డి :
బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 29 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది.ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్టు.
5) పెళ్ళి సందడి :
శ్రీకాంత్ హీరోగా కే.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 27 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది.ఈ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.
6) నువ్వే కావాలి:
తరుణ్ హీరోగా కే.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 25 సెంటర్స్ లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది. ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అన్న సంగతి తెలిసిందే.
7) ప్రేమాభిషేకం:
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ఈ మూవీ 19 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది.
8) నరసింహ నాయుడు :
బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 17 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది. ఇది కూడా ఇండస్ట్రీ హిట్ మూవీ.
9) కలిసుందాం రా :
వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం 14 కేంద్రాల్లో డైరెక్ట్ గా175 రోజులు ఆడింది. ఇది కూడా ఇండస్ట్రీ హిట్ మూవీ.
10) లవ కుశ :
సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ 13 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: