రామ్ చరణ్ కథతో విజయ్ దేవరకొండ సినిమా..?

Anilkumar
'మళ్ళీ రావా', 'జెర్సీ' సినిమాలతో  గౌతమ్ తిన్ననూరి  సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అన్న విషయం తెలిసిందే.ఇక  'జెర్సీ' తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  తో సినిమా చేసే అవకాశం కూడా అందుకున్నారు.ఇకపోతే ఆ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది కూడా! అయితే... ఈ మధ్య ఆ చిత్రాన్ని పక్కన పెట్టేశారు అనుకోండి! కారణాలు ఏవైనా... రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమా ఆగింది. ఇక ఇప్పుడు కొత్త సినిమాపై దర్శకుడు దృష్టి పెట్టారు.అయితే రామ్ చరణ్ సినిమా ఆగిన తర్వాత ఆయన దగ్గర నుంచి విజయ్ దేవరకొండ  దగ్గరకు గౌతమ్ తిన్ననూరి వచ్చారని టాలీవుడ్ టాక్. 

ఇకపోతే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ల మాంచి ఎంటర్‌టైనర్ ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుగు చిత్రసీమ వర్గాల కథనం.అంతేకాదు  ఆల్రెడీ విజయ్ దేవరకొండకు గౌతమ్ తిన్ననూరి కథ చెప్పడం, దానికి హీరోతో పాటు నిర్మాత నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగాయట.ఇక  వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది.ఇకపోతే జెర్సీ'ని గౌతమ్ తిన్ననూరి హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ అక్కడ జంటగా నటించారు.అయితే  ఆ సినిమా నిర్మాతలలో 'దిల్' రాజు ఒకరు.ఇక  తెలుగులో వచ్చినంత పేరు హిందీలో రాలేదు. వసూళ్లు కూడా అంతంత మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ...ఇక  గౌతమ్ ప్రతిభపై 'దిల్' రాజు నమ్మకం ఉంచారు.కాగా  విజయ్ దేవరకొండతో ఆయన సినిమా చేయనున్నారని కొన్ని రోజుల నుంచి వినబడుతోంది. ఇక దానికి దర్శకుడిగా తొలుత శివ నిర్వాణ,

 ఆ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి పేర్లు వినిపించాయి.అయితే  చివరకు, గౌతమ్ తిన్ననూరి ఫిక్స్ అయ్యారు. అంతేకాదు త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది.ఇదిలా ఉంచితే విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలతో చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' బాక్సాఫీస్ బరిలో ఘోరంగా చతికిలపడింది.ఇకపోతే  వసూళ్ల సంగతి పక్కన పెడితే... రౌడీ బాయ్స్, ఫ్యాన్స్‌కు కూడా సినిమా నచ్చలేదు. ఇక ఆ రిజల్ట్ విజయ్ దేవరకొండ మీద చాలా ఎఫెక్ట్ చూపించిందని, దాని నుంచి కోలుకోవడం కోసం కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారట. అయితే నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ 'ఖుషి' షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట.కాగా  శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఆ సినిమాలో సమంత హీరోయిన్.అయితే  ఆల్రెడీ కశ్మీర్ మంచు కొండల్లో ఒక షెడ్యూల్ చేశారు.ఇక  కొత్త షెడ్యూల్ హైదరాబాద్ సిటీలో స్టార్ట్ కానుందని టాక్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: