పెద్దింటి అమ్మాయితో అల్లు శిరీష్ బ్రేకప్.. అసలు మ్యాటర్ చెప్పిన హీరో..?

Anilkumar
అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ అందరికి సుపరిచితమే.ఇక  అల్లు కుటుంబం నుంచి వచ్చిన అల్లు శిరీష్ ఎలా అయినా హీరోగా నిలదొక్కుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.అంతేకాదు  తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ ద్వారా అనేక సినిమాలతో ప్రయోగాలు చేసిన అల్లు శిరీష్ చాలా కాలం నుంచి సైలెంట్ గా ఉన్నాడు.అయితే  ప్రస్తుతం ఆయన నటించిన ఊర్వశివో రాక్షసివో అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు.ఇదిలావుంటే ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటించింది.

ఇక  విజేత అంటూ కళ్యాణ్ దేవ్ ని హీరోగా పరిచయం చేసిన రాకేష్ శశి ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.ఇకపోతే  నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సినిమా యూనిట్.ఇక  ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అల్లు శిరీష్ తాజాగా తన జీవితంలో ఉన్న బ్రేకప్ గురించి బయట పెట్టాడు.ఇదిలావుంటే తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో సదరు యాంకర్ మీ జీవితంలో బ్రేకప్ గురించి చెప్పాలని అడిగితే తన జీవితంలో చాలా బ్రేక్ అప్స్ ఉన్నాయని ముఖ్యంగా రెండు మూడు బాగా పెద్ద బ్రేకప్స్ అయ్యాయి అని చెప్పుకొచ్చారు.

ఇక వారితో చాలా క్లోజ్ అయిన తర్వాత బ్రేకప్ అయిందని, ఈ సందర్భంగా అల్లు శిరీష్ పేర్కొన్నారు. అయితే ఇక  ఒక పెద్దింటి అమ్మాయి మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయితో కూడా బ్రేకప్ అయిందట కదా అని అడిగితే అవునని ఆమెకు తానే బ్రేకప్ చెప్పానని ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు.ఎప్పుడైనా మీరు ఈ విషయంలో బాధపడ్డారా అని అడిగితే బాధపడ్డాను అని చెప్పుకొచ్చారు అల్లు శిరీష్. ఇక ఈపాటికి అంతా బాగుండి ఉంటే ఆమెను పెళ్లి చేసుకుంటే మీకు కూడా అర్హ, అయాన్ లాగా ఇద్దరు పిల్లలు తిరుగుతూ ఉండేవారు కదా అంటే తనకు కూడా అప్పుడప్పుడు అదే అనిపిస్తుందని అనవసరంగా బ్రేకప్ చెప్పుకొని టైం వేస్ట్ చేస్తున్నానేమో అని అనిపిస్తుందని ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. అయితే మొత్తం మీద అల్లు శిరీష్ చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: