అలియాభట్ హాస్పిటల్ ఖర్చు ఎంతో తెలుసా...?

murali krishna
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హీరోయిన్లలో అలియా భట్ ఒకరనే విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో అలియా భట్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. వైద్యులు అక్టోబర్ నెల చివరి వారం నాటికి అలియా భట్ బిడ్డకు జన్మనిస్తుందని వెల్లడించారని సమాచారం అందుతోంది.


వైద్యులు అలా చెప్పడంతో అలియా భట్, రణ్ బీర్ ఇప్పటికే ఆస్పత్రిని ఫైనలైజ్ చేసుకున్నారని సమాచారం అందుతోంది. ఆ ఆస్పత్రికి రోజుకు 15,000 రూపాయల చొప్పున చెల్లించనున్నారని తెలుస్తోంది. అలియా భట్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తక్కువ ఖర్చు ఉన్న ఆస్పత్రిలో పని చేయడానికి ఆమె సిద్ధమయ్యారట.గిర్గావ్ లో ఉన్న సర్ హెచ్.ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో అలియా భట్ పేరు నమోదు చేసుకున్నట్లు ప్రముఖ మీడియా ద్వారా వెల్లడైందట.


ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అలియా రణ్ బీర్ లకు పెళ్లి జరగగా జూన్ నెలలో గర్భం దాల్చినట్లు అలియా భట్ అయితే ప్రకటించారు.


అయితే పెళ్లికి ముందే అలియా భట్ గర్భవతి అయ్యారని క్లారిటీ కూడా వచ్చింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో అలియా భట్ బిజీగా ఉన్నారు. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని సినిమాలో కూడా అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలియా భట్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సినిమాసినిమాకు అలియా భట్ కు మార్కెట్ పెరుగుతుండగా అలియా భట్ టాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు అలియా భట్ కు క్రేజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. అలియా భట్ ఒక్కో ప్రాజెక్ట్ కు 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: