గీతా ఆర్ట్స్ లో 'గీత' పేరు అందుకే.....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో గీతా ఆర్ట్స్ గురించి తెలియని వారుండరు. ఈ బ్యానర్ పై అనేక విజయవంతమైన సినిమాలు వచ్చాయి. కొంత మంది గీతా ఆర్ట్స్ సినిమా అని థియేటర్లకు వెళ్లిన వారున్నారు.అంతలా నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోలకు లైఫ్ ఇచ్చింది ఈ నిర్మాణ సంస్థ. అయితే గీతా ఆర్ట్స్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని చాలా మందిలో డౌట్ ఉండే ఉంటుంది. ఈ డౌట్ పై స్వయంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చాడు. ఆ పేరు పెట్టడం వెనుక ఓ పెద్ద స్టోరే ఉందట. ఇంతకీ అల్లు అరవింద్ 'గీతా ఆర్ట్స్' గురించి ఏం చెప్పారంటే..?
ప్రముఖ హస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన కుమారుడు అల్లు అరవింద్ పలు ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సంచలన విషయాలను బయటపెడుతున్నారు. తన పర్సనల్ విషయాలను మీడియాతో షేర్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ఓ టీవీ చానెల్లో మాట్లాడిన ఆయన గీతా ఆర్ట్స్ లో 'గీత' పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే..
హస్య నటుడిగా పేరున్న అల్లు రామలింగయ్య ఆధ్యాత్మిక భావాలు గల వ్యక్తి. ఆయనకు భగవద్గీతపై విపరీత నమ్మకం. దీంతో భగవద్గీతలోని 'గీత' పేరు నిర్మాణ సంస్థకు పెట్టాలని అల్లు అరవింద్ కు సూచించాడట. అంతేకాకుండా 'గీత' పేరును ఎందుకు పెట్టాలో కూడా చెప్పాడట. భగవద్గీతలోని సారాంశాల్లో 'పనిచేయడమే నీ వంతు.. ఫలితం పరిస్థితులను భట్టి వస్తుంది..' అని ఉంటుంది. సినిమా నిర్మాతల పరిస్థితి కూడా అదే. డబ్బు ఖర్చుపెట్టి సినిమా తీయడమే మన పని.. సక్సెస్.. అన్ సక్సెస్ అంతా ప్రేక్షకుల చేతిలో ఉంటుంది.. అని అల్లు రామలింగయ్య వివరిస్తూ ఈ పేరు పెట్టాడట.అయితే పెళ్లయిన తరువాత 'గీత' పేరు మార్చి నిర్మల ఆర్ట్స్ అని పెట్టొచ్చుగా అని అడిగితే.. 'గీత' ఆర్ట్స్ బ్యానర్ పై చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. కొన్ని సినిమాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాయి. దీంతో ఈ పేరు మార్చాలని అనిపించలేదు. అంతేకాకుండా తనకు గీత అనే ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేదట. ఇలా తనకు అన్ని విధాలుగా కలిసొచ్చిన 'గీత'ను అలాగే కొనసాగిస్తున్నానని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: