'అల్లు అర్జున్ - రామ్ చరణ్' కాంబోలో భారీ మల్టీస్టారర్.. కన్ఫర్మ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఓ సినిమా చేస్తే? ఈ ఊహ ఎంత బావుందో కదూ! దానిని ఊహ అనడం కంటే ఓ అగ్ర నిర్మాత బలమైన కోరికగా చెప్పడం సబబు!ఇకపోతే ఎప్పటికి అయినా సరే నిజం అవుతుందని అనడం కరెక్ట్! ఎందుకంటే... ఆయన తలుచుకుంటే చరణ్, అర్జున్‌తో సినిమా చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఆల్రెడీ టైటిల్ ఫిక్స్ చేశారు.అయితే ఈ  సినిమా తీయడానికి తాను సిద్ధమని ప్రకటించారు.అంతేకాదు  ఆయన ఎవరు? అసలు కథ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా నిర్మించాలని ఉందని చెప్పిన అగ్ర నిర్మాత ఎవరో కాదు... మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఇకపోతే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.అయితే 'భవిష్యత్తులో గీతా ఆర్ట్స్ సంస్థలో ఎటువంటి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు?' అని ఆలీ అడగ్గా... ''ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో గానీ, నా కోరిక ఒకటి ఉంది.ఇక  గీతా ఆర్ట్స్ లో బన్నీ, చరణ్ కలిసి పని చేస్తే బావుంటుంది. అంతేకాదు నేను పదేళ్ల క్రితం ఒక టైటిల్ రిజిస్టర్ చేశా.అయితే  'చరణ్ - అర్జున్' (Charan arjun Telugu Movie) అని.

ఇక ఆ టైటిల్ ఇప్పటి వరకు రెన్యూవల్ చేస్తూ వస్తున్నాను. అయితే ఎప్పటికి అయినా సరే ఆ సినిమా జరుగుతుందని ఆశ'' అని అల్లు అరవింద్ సమాధానం చెప్పారు. అంతేకాదు ఇప్పటి వరకూ ఆ సినిమా కోసం కథలు వినడం ప్రారంభించలేదని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఇకపోతే బీటైటిల్ ఉంది కాబట్టి... భవిష్యత్తులో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.అయితే 'ఎవడు' సినిమాలో రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించారు. అయితే, ఇక  ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేములో ఉండరు. ఇక అందులో అల్లు అర్జున్ స్క్రీన్ మీద కనిపించేది చాలా తక్కువ సమయమే. అందుకని,ఇక  ఆ సినిమాను పూర్తిస్థాయి మల్టీస్టారర్ అని చెప్పలేం! ఇప్పుడు అల్లు అరవింద్ చెప్పిన దాని ప్రకారం... వీళ్ళిద్దరి మల్టీస్టారర్ కన్ఫర్మ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: