ఆ హీరో బాధ తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిన ఇంద్రజ...!!

murali krishna
ఈ హీరోయిన్ అందానికి అప్పట్లో చాలామంది మంత్రముగ్ధులయ్యారు. కేవలం కుర్రాళ్ళు మాత్రమే కాకుండా స్టార్ హీరోలు సైతం ఆమె అందం అభినయానికి బాగా ఆకర్షితులయ్యారు.


ఆమె ఎవరో కాదు హీరోయిన్ ఇంద్రజ.. ఆలీ హీరోగా వచ్చిన యమలీల సినిమా తో బ్లాక్ బస్టర్ సినిమా ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమెకు చాలానే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఇంద్రజ కెరియర్ పీక్స్ లో ఉండగానే బిజినెస్ మాన్,నటుడు అయినటువంటి మహమ్మద్ అబ్సర్ ను వివాహం చేసుకొని వివాహ బంధం లో సెటిల్ అయిపోయిం.


ఆ తర్వాత చాలా రోజులు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి బుల్లితెర ప్రోగ్రామ్స్ ద్వారా మళ్లీ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అమ్మ,అక్క పాత్రలు చేస్తూ సినిమాల్లో కూడా బిజీ అయిపోయింది. అయితే ఇంద్రజ సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆమె పై ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని, ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎన్నో రోజులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు కూడా మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కానీ ఎందుకో ఏమో గాని ఇద్దరిమధ్య దూరం ఏర్పడింది.


ఇంద్రజ ఆ స్టార్ హీరో లో కొంచెం మార్పు కనిపించడం తో విషయం ఏంటని అతని గురించి ఆరా తీసిందట. దాంతో ఆ హీరో గురించి సంచలన నిజం బయటపడిందట. ఆ హీరో తనతో క్లోజ్ గా ఉంటూనే మరొక హీరోయిన్ తో తిరుగుతున్నాడనే నిజం ఆమెకు తెలియటంతో ఆ హీరోని పెళ్లి చేసుకోవాలనుకున్నా తన ఉద్దేశాన్ని మార్చుకుందట. ఇక ఒకానొక టైంలో ఆ స్టార్ హీరో ని తన బాధ ఆపుకోలేక నన్ను ఎందుకు ఇలా మోసం చేసావు అని అడిగిందట. దానికి ఆ స్టార్ హీరో ఆమెను చాలా దారుణంగా అవమానించి నీ రేటెంతో చెప్పు నీ మొహాన పడేస్తా అంటూ డబ్బులు విసిరేశాడట. ఇక స్టార్ హీరో అన్న మాటలు భరించలేక ఇంద్రజ చాలా రోజులు డిప్రెషన్లోకి వెళ్లిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: