"జిన్నా" మూవీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కోన వెంకట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు ఆయన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు ఇప్పటికీ అనేక మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు  ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు "జిన్నా" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహించగా ,  కోన వెంకట్ స్క్రీన్ ప్లే ను అందించాడు. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ ఈ మూవీ లో మంచు విష్ణు సరసన హీరోయిన్ లుగా నటించారు.

ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ను అందించిన కొన వెంకట్ ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా కోన వెంకట్ "జిన్నా" మూవీ గురించి మాట్లాడుతూ ... జిన్నా మూవీ కి పని చేసిన ప్రతి నటుడు మరియు టెక్నీషియన్ నేను జిన్నా మూవీ కి పని చేశాను ,  అని జీవితాంతం చాలా గర్వంగా చెప్పుకుంటాడు ,  అటువంటి సినిమా జిన్నా అని చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బంధం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారు. మంచు విష్ణు ఆఖరిగా మోసగాళ్లు మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది. మరి జిన్నా మూవీ తో  ఎలాంటి విజయాన్ని మంచి విష్ణు బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: