నాగ చైతన్య రెండో ఎవరితోనో తెలుసా...?

murali krishna
నాగచైతన్య సమంత విడిపోయినప్పటి నుండి వీరికి సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. మరీ ముఖ్యంగా సమంత గురించి అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదిక గా ఎన్నో ట్రోల్స్ అయితే చేస్తున్నారు.


ఇక విడాకుల తర్వాత కూడా వీరిద్దరికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏమాత్రం కూడా తగ్గలేదు.వీరిద్దరూ డివోర్స్ తీసుకున్న తర్వాత ఏ చిన్న పని చేసినా కూడా దాన్ని అభిమానులు,మీడియా చాలా హైలెట్ చేసి చూపిస్తుంది. అయితే ప్రస్తుతం నాగచైతన్య కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో చాలా వైరల్ గా మారింది. మరి ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


సమంత ఈ మధ్యనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నువ్వు ఎక్కువకాలం ఒంటరిగా జీవించలేవు అంటూ క్యాప్షన్ పెట్టి అలాగే అదే కొటేషన్ ఉన్న టీ షర్ట్ కూడా ధరించిందట.. ఇక సమంత చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాగచైతన్య రెండో పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఎప్పటినుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా నాగార్జున అమల ఇద్దరూ నాగచైతన్య కోసం అమ్మాయిని వెతికే పనిలో పడ్డారట. నాగార్జున అమల ఇద్దరు వారి కుటుంబంలోని అమ్మాయిని వారి ఇంటికి కోడలిగా తెచ్చుకోవాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో అమల దగ్గుబాటి కుటుంబం నుంచి నాగచైతన్య కు ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసిందని తెలుస్తుంది.


ఇక నాగార్జున కూడా తన అమ్మ అన్నపూర్ణమ్మ గారి తరఫున ఉన్న ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసి నాగ చైతన్య కు భార్య గా చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక ఇక నాగార్జున అమల ఇద్దరూ చూసినా సంబంధాలు అక్కినేని ఫ్యామిలీకి చెందినవే. అంతే కాకుండా వీళ్లు చూసిన సంబంధం చాలా రిచ్. అయితే నాగచైతన్య మాత్రం నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అంటూ తేల్చి చెప్పారని తెలుస్తుంది.అంతే కాదు ఇప్పుడు నా దృష్టి మొత్తం నా సినీ కెరీర్ మీదే ఉంది. నా కెరియర్ ముందు తర్వాతే పెళ్ళి గురించి ఆలోచిస్తాను అని చెప్పాడట. అయితే నాగార్జున అమల చూసిన రెండు సంబంధాలలో ఎవరో ఒక అమ్మాయిని మాత్రం కచ్చితంగా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: